అనసూయ షోలో పల్లవి ప్రశాంత్‌, శివాజీలకు అన్యాయం.. వారిని కావాలనే పక్కన పెట్టారా?

First Published | Jun 29, 2024, 10:28 AM IST

అనసూయ జడ్జ్ గా శ్రీముఖి యాంకర్‌గా చేస్తున్న కొత్త షోలో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ పల్లవి ప్రశాంత్‌, శివాజీలకు అన్యాయం జరుగుతుంది. అది చాలా మిస్‌ అవుతామంటున్నారు ఫ్యాన్స్. 
 

Anasuya Bharadwaj

ఒకప్పుడు జబర్దస్త్ షోని యాంకర్‌గా ఊపేసింది అనసూయ భరద్వాజ్‌. కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ బుల్లితెరపైకి వచ్చింది. ఆమె జడ్జ్ గా కొత్త షో ప్రారంభమవుతుంది. `కిర్రాక్‌బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` పేరుతో స్టార్‌ మా కొత్త షోని ప్రారంభిస్తుంది. నేటి(జూన్‌ 29) నుంచే ఇది ప్రారంభం కాబోతుంది. ఇందులో గత సీజన్‌ బిగ్‌ బాస్‌ టాప్‌ కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. వీరితోపాటు పాత సీజన్ల కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. 

ఈ షోకి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, అనసూయ లేడీస్‌ టీమ్‌కి లీడర్‌గా, జడ్జ్ గా, శేఖర్‌ మాస్టర్‌ బాయ్స్ టీమ్‌కి లీడర్‌గా, జడ్జ్ గా వ్యవహరించబోతున్నారు. ఇక ఇందులో బాయ్స్ నుంచి అర్జున్‌,అమర్‌ దీప్‌, నిఖిల్‌, శ్రీకర్‌, గౌతమ్‌ టేస్టీ తేజ, యాదమ్మ రాజు, చైతూ, కిరణ్‌ గౌడ్‌ పాల్గొంటున్నారు. అలాగే అమ్మాయిల టీమ్‌ నుంచి ప్రియాంక జైన్‌, శోభా శెట్టి, విష్ణు ప్రియా, సౌమ్యారావు, దీపికా, ఆయేషా ఖాన్‌, ప్రేరణ, గోమతి, పల్లవి గౌడ, రీతూ చౌదరి వంటి వారున్నారు. బాయ్స్ టీమ్‌, లేడీ టీమ్ ల మధ్య గేమ్‌ జరగనుంది. సవాళ్లతో కూడి గేమ్‌ కావడం విశేషం. 
 


Pallavi Prashanth - Sivaji

అయితే ఇందులో గత సీజన్‌ బిగ్‌ బాస్‌ టాప్‌, క్రేజీ కంటెస్టెంట్లు ఉన్నారు. కానీ ఇద్దరు మిస్‌ అయ్యారు. వాల్లే పల్లవి ప్రశాంత్, శివాజీ. పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ 7 టైటిల్ విన్నర్‌. సంచలనలకు కేరాఫ్‌. పైగా రైతు బిడ్డ. ఆయనతోపాటు హీరో శివాజీ సైతం ఇందులో కనిపించడం లేదు. ఇంతటి క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఉన్న ఈ ఇద్దరు ఈ షోలో కనిపించకపోవడం కొత్త చర్చకు దారితీస్తుంది. వీరి అభిమానులు మాత్రం స్టార్‌ మా అన్యాయం చేసిందని కామెంట్‌ చేస్తున్నారు. పడని వాళ్లు వీళ్లు లేకపోవడమే బాగుందని, హాయిగా అనిపిస్తుందని అంటున్నారు. 
 

Pallavi Prashanth - Sivaji

బిగ్‌ బాస్‌ షో ఫైనల్‌ తర్వాత విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ చేసిన పని పెద్ద గొడవకి దారి తీసిన విషయం తెలిసిందే. ర్యాలీగా వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా, వాళ్ల కళ్లు కప్పి పల్లవి ప్రశాంత్‌ ర్యాలీలో పాల్గొనడంతో పెద్ద ఇష్యూ అయ్యింది. దీంతో దీనిపై కేసు పెట్టి, ప్రశాంత్‌ని జైల్లో పెట్టారు. తనకు వచ్చిన క్రేజ్‌ మొత్తం ఆ రూపంలో పోయింది. ఇక శివాజీ కూడా అన్ని విషయంలో పల్లవి ప్రశాంత్‌లకు సపోర్ట్ చేశాడు. అలాగే యావర్‌ కూడా వీరి బ్యాచ్‌గానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురిని ఆహ్వానించలేదు స్టార్‌ మా. వీరిని పక్కన పెట్టారు.
 

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ షోలో పల్లవి ప్రశాంత్‌, శివాజీ, యావర్‌లను తీసుకోకపోవడం గమనార్హం. అయితే అప్పుడు వివాదం నెలకొన్న నేపథ్యంలో వీరిని తీసుకుంటే విమర్శలు వస్తాయనే కారణాలతో, షోలో ఏదైనా డిస్టర్బెన్స్ చోటు చేసుకుంటుందనే ఉద్దేశ్యంతోనే నిర్వాహకులు వీరిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో పల్లవి ప్రశాంత్‌, శివాజీలను అప్రోచ్‌ అయ్యారా? వాళ్లు వద్దన్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. 
 

కానీ వీళ్లు ఉంటేనే మజా, లేకపోతే అంత కిక్‌ కష్టమని పెదవి విరుస్తున్నారు ఫ్యాన్స్. అయితే లేడీ భామలు అనసూయ, విష్ణు ప్రియా, రీతూ చౌదరి, సౌమ్యరావు వంటి వారు చేసే సందడి ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఇక ఎప్పటిలాగే అమర్‌దీప్‌ తన ఫన్నీ చేష్టలతో నవ్వులు పూయించే అవకాశం ఉంది. విడుదలైన ప్రోమో అయితే ఆకట్టుకుంది. మరి నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ షో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 
 

Latest Videos

click me!