శ్రీవిద్య 1970లలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ చిత్రాలలో నటించి అగ్ర నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె 13 ఏళ్ల వయసులో తొలిసారిగా నటించింది. అపూర్వ రాగంగల్ తో ఆమె కెరీర్‌లో అతిపెద్ద మలుపు తిరిగింది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన శ్రీవిద్య నటించింది. వీరిద్దరూ జంటగా నటించిన తొలి సినిమా ఇదే. ఇదే వారి మధ్య చిగురించేలా చేసింది.