ఎపిసోడ్ ప్రారంభంలో తన జుట్టుకి సాంబ్రాణి వేసిన భర్తకి థాంక్స్ చెప్తుంది వేద. ఎందుకు థాంక్స్ అంటాడు యష్. నాకు సాయం చేసినందుకు అంటుంది వేద. సాయం చేస్తే బంధం బలపడుతుందంట మీ అత్తగారు చెప్పారు అంటాడు యష్. ఒక భార్యకి భర్త కన్నా ఎవరు ఇంపార్టెంట్ కాదంట మీ అత్తగారు చెప్పారు అంటుంది వేద. నవ్వుతున్న భర్తని చూసి నేను కోరుకున్నది ఇదే కదా, ఒప్పందంతో మొదలైన మన పెళ్లి బంధంగా మారాలి. ఖుషి కి అమ్మగా మీ జీవితంలో స్థానం ఇచ్చిన మీరు మీ భార్యగా కూడా మీ మనసులో స్థానం ఇవ్వాలి, నేనే మీకు ఇంపార్టెంట్ అవ్వాలి అనుకుంటుంది. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నావు భార్యామణి గారు అనుమతి ఇస్తే భవదీయుడు రెడీ అవుతాడు అంటాడు యష్.