108 (కళ్యాణ్ రామ్ '118' రివ్యూ)

First Published Mar 1, 2019, 3:04 PM IST

కలలు నిజమౌతాయా...కలను బేస్ చేసుకుని ఇన్విస్టిగేషన్ చేసి ఓ మర్డర్ కేసుని దాని వెనక ఉన్న క్రైమ్ ని బయిటపెట్టచ్చా? ఛాయాగ్రాహకుడు నుంచి  దర్శకుడుగా మారిన గుహన్ ...తను కన్న కల లాంటి  '118' తో  మన ముందుకు వచ్చి కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాడు.

(------Review By సూర్య ప్రకాష్ జోశ్యుల)కలలు నిజమౌతాయా...కలను బేస్ చేసుకుని ఇన్విస్టిగేషన్ చేసి ఓ మర్డర్ కేసుని దాని వెనక ఉన్న క్రైమ్ ని బయిటపెట్టచ్చా? ఛాయాగ్రాహకుడు నుంచి దర్శకుడుగా మారిన గుహన్ ...తను కన్న కల లాంటి '118' తో మన ముందుకు వచ్చి కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాడు. కలలు కూడా మన కెరీర్ కు ఉపయోగపడతాయని హీరో చేత చెప్పించే ప్రయత్నం చేస్తాడు. సినిమావాళ్లుకు ముఖ్యంగా క్రియేటర్స్ కలలు అవసరమేమో కానీ మిగతావాళ్ల కూడా పనులు మానేసి పగటి కలలు కంటూ కూర్చంటే కష్టమే. ఇంతకీ '118' లో కళ్యాణ్ రామ్ వచ్చిన కలేంటి...అది అతని జీవితంలో రేపిన కలకలం ఏమిటి అనేది రివ్యూలో చూద్దాం.
undefined
కథ: ఇన్విస్టిగేటివ్ జర్నిలిస్ట్ గౌతమ్‌ (కల్యాణ్‌రామ్‌) కు ఓ హోటల్ లో 118 రూమ్ లో పడుకున్నప్పుడు 1.18 నిముషాలకు ఓ కల వస్తుంది. అంతలా టైమ్ చూసుకుని వచ్చిన ఆ కల మళ్లీ మళ్లీ ఆ హోటల్ లో దిగినప్పుడు రిపీట్ అవుతుంది. ఆ కలలో ఓ అందమైన అమ్మాయి (నివేదా థామస్‌) కనిపిస్తుంటుంది. ఆమెను కొంతమంది చంపాలని ప్రయత్నం చేయటం, ఆ తర్వాత ఓ కారుని లోయలోకి తోసేయడం..ఆ కలలో కనపడుతుంది. కలే కదా అని లైట్ తీసుకుందామనుకుంటే ఆ తర్వాత ఆ కలలో కనపడినవన్నీ కళ్ళకు ఎక్కడో చోట నిజ జీవితంలో కనపడి ఆశ్చర్యపరుస్తాయి. దాంతో ఆ కల ఏమిటి..అసలు నివేదా థామస్ ఎవరు..ఆమెను ఎవరు చంపబోయారు వంటి విషయాలు ఇన్విస్టిగేట్ చేయటం మొదలెడతాడు. ఆ క్రమంలో అతన్ని కొందరు చంపటానికి ప్రయత్నిస్తారు. వాళ్లు ఎవరు...ఆ కలకు వాళ్లకు ఉన్న లింకేంటి...అసలు కలలో కనపడింది నిజమేనా...అతనికే ఆ కల ఎందుకు వచ్చింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
కలే కదా అని తీసేస్తే: సాధారణంగా మనం ఎవరైనా కలే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ ఈ సినిమాలో హీరో ...కలను కాస్త ఎక్కువ సీరియస్ గా తీసుకుని ఇన్విస్టిగేట్ చేస్తాడు. అలాగే ఆ కల కూడా ఏదో పజిల్ లాగ ఉంటుంది. అదేదో పూర్తిగా కల వచ్చేస్తే ..దాన్ని పట్టుకుని హీరో చేయగలిగేది చేద్దుడు. అతను ఆ కలను ఛేధించగలడా లేదా అనే పరీక్ష పెడుతున్నట్లు ముక్కలు ముక్కలు గా కల వస్తుంది..ఆ కల ద్వారా తన సందేశం చెప్పాలనుకున్న నివేదా ...అర్దమయ్యేటట్లు చెప్పదు. దాంతో టైమ్ అంతా ఆ కలలో వచ్చిన విషయాలు సేకరించుకోవటానికి ఏం జరిగిందో తెలుసుకోవటానికే పట్టేస్తుంది. అంతేకానీ అసలు కథలో ఉన్న విలన్స్ పని పట్టే అవకాసం ఇవ్వదు.
undefined
హీరో పనిగట్టుకుని కలను ఓ మర్డర్ ఇన్విస్టిగేషన్ లా ఛేధించి ప్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సి వస్తుంది. సినిమా చూస్తూంటే ఆ కలను అతనికి అందించే ఆత్మ (మరెవరో క్లారిటీ చెప్పరు) అంతా ఒకేసారి చెప్పేస్తే బాగుండును అనిపిస్తుంది. దాంతో సినిమా మొత్తం ...తనకలలోకి వచ్చిన విషయం ఏమిటనేది తెలుసుకోవటానికే సరిపోయింది. నివేధాను చంపినవారికి బుద్ది చెప్పటానికి స్కీన్ టైమ్ సరిపోలేదు. దాంతో సెకండాఫ్ బోర్ గా తయారైంది. అదేదో ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి అయినా అసలేం జరిగిందనే విషయం క్లారిటీ వచ్చేస్తే సెకండాఫ్ లో విలన్స్ , హీరోకు మధ్య గేమ్ లా ఉండి ...కాస్త ఇంట్రస్ట్ గా ఉండేది. కళ్యాణ్ రామ్ లాంటి హీరోని పెట్టుకుని అతన్ని మళ్లీ కల గని సమస్య పరిష్కరించాలనే సీన్స్ పెట్టడం చాలా ఇబ్బందిగా అనిపించింది.
undefined
సీరియల్ లా కల కంటిన్యూ అవటం ఏంటి: టీవి సీరియల్ వస్తున్నట్లుగా ...హీరో కువచ్చే కల...ఓ సారి కొంత భాగం..మరో సారి కొంత భాగం..అలాగే వేరకొరికి కొంత భాగం వస్తుంది. చివర్లో మిగిలిన క్లైమాక్స్ కల భాగం కోసం హీరో వెయిట్ చేయటం అంతా ఏంటో విచిత్రంగా ఉంటుంది. ఇంకా విలన్స్ ఆ క్లైమాక్స్ రాకుండా అతను నిద్రపోకుండా అడ్డుపడే సీన్స్ కూడా ఉంటేయేమో అనిపిస్తుంది.
undefined
హ్యాపీ విషయం ఏంటంటే: ఈ సినిమాలో ఆనందపరిచే విషయం డాన్స్ లు, రొమాన్స్ , పాటలు లేకపోవటం. అలాగే సినిమా లెంగ్త్ కూడా తక్కువ ఉండటం. దాంతో బోర్ కొట్టినా మరీ పరాకాష్టకు వెళ్లలేదు. పాటలు కూడా ఉండి ఉంటే చివరిదాకా జనం ఉండకపోదురు.
undefined
హీరోయిన్ ఉన్నా లేనట్లే: ఈ సినిమాలో నిజానికి హీరోయిన్ కు పాత్ర లేదు. కాకపోతే తెలుగు సినిమా కాబట్టి హీరోని ప్రేమించి పెళ్లికి రెడీ అయిన అమ్మాయి అని హీరోయిన్ (షాలిని పాండే) పాత్ర పెట్టి, కళ్యాణ్ రామ్ తో పాటు అప్పుడప్పుడు వెనక నిలబడి...నాలుగైదు డైలాగులు చెప్పే పాత్ర ఇచ్చారు.
undefined
కళ్యాణ్ రామ్ ఎలా చేసాడు: కల్యాణ్‌రామ్‌ గతంలో జర్నలిస్ట్ గా చేసాడు కానీ ఈ సినిమాలో బాగా చేసాడు. లుక్ బాగుంది కానీ చాలా చోట్ల సహజంగా నటించడానికి ప్రయత్నించే ప్రాసెస్ లో బిగిసుకుపోయిన్లు కనిపించాడు. రాజీవ్‌ కనకాల, ‘ఛమక్‌’ చంద్ర, నాజర్‌ వంటివాళ్లు ఎప్పటిలాగే తమదైన శైలిలో చేసుకుంటూ పోయారు.
undefined
నీరసం తెప్పించాయి: నిజానికి నివేదా ఎపిసోడ్ ని నమ్ముకునే కథ,కథనం అల్లుకున్నారని అర్దమవుతుంది. కానీ ఆ ఎపిసోడ్ మరీ పెద్దదిగా ఉంది. నివేదాని చంపింది ఎవరు..ఎందుకు చంపారు అనే విషయం చెప్పేసాక...వచ్చే సీన్స్ సాగిన ఫీలింగ్ తెచ్చాయి. ఆ ప్లాష్ బ్యాక్ ఎప్పుడు అయ్యిపోతుందా అని ఎదురుచూసేలా చేసింది.
undefined
టెక్నికల్ గా: ఛాయాగ్రాహకుడుగా ఎంతో ప్రతిభ చూపిన గుహన్ ..తన డిపార్టమెంట్ సినిమాటోగ్రఫి ని బాగా వర్కవుట్ చేసారు. తనదైన స్టైలిష్‌ టేకింగ్‌, మేకింగ్ తో మెప్పించాడు. అలాగే సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్రకు ఆ విషయంలో మంచి మార్కులే పడతాయి.. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
undefined
ఫైనల్ థాట్: కలలు చుట్టూ కథలు అల్లచ్చు కానీ...ఆ కలను సీరియల్ గా ముక్కలు చేసి, దాన్ని హీరో ముందు పజిల్ లా పెట్టి సాల్వ్ చేయమనంటం మాత్ర దారుణం Rating : 25
undefined
click me!