Amigos Review
నందమూరి కళ్యాణ్ రామ్ లాస్ట్ రిలీజ్ బింబిసార సూపర్ హిట్ కొట్టింది. సోసియో ఫాంటసీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బింబిసార కళ్యాణ్ రామ్ కి ఓ మెమరబుల్ హిట్ ఇచ్చింది. వశిష్ట్ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. ప్రయోగాత్మక చిత్రంతో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ అమిగోస్ తో మరో ప్రయోగం చేశారు.
Amigos Review
టైటిల్ తోనే ఒక ఆసక్తి క్రియేట్ చేశారు. అమిగోస్ అంటే స్పానిష్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్ అని అర్థం. ఇక మూవీ కాన్సెప్ట్ చెప్పాలంటే ప్రపంచంలో ఒకరిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడి ఉంది. అమిగోస్ మూవీలో ప్రతి ఒక్కరు తమలా ఉండే వ్యక్తులను కలిసే సాఫ్ట్వేర్ ని హీరో డెవలప్ చేస్తాడు. ఈ క్రమంలో తాను తనలా ఉన్న మరో ఇద్దరిని కలుస్తాడు. తాను కలిసి ఆ ఇద్దరు ఎవరు? వారి నేపధ్యాలు ఏమిటీ? తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ? అనేది అమిగోస్ మూవీ
Amigos Review
ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ తమ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో అమిగోస్ గుడ్ మూవీ అంటున్నారు. ప్రేక్షకులను అలరించే థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. కాన్సెప్ట్ కొత్తగా ఉందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.
త్రిపాత్రాభినయంలో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నారు అంటున్నారు. డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రల్లో వైవిధ్యం చూపిస్తూ మెప్పించారనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఆషికా రంగనాథ్ గ్లామర్, యాక్షన్ సన్నివేశాలు చెప్పుకోదగ్గ అంశాలు. సెకండ్ హాఫ్ లో వచ్చే బాలయ్య రీమిక్స్ సాంగ్ ''ఎన్నో రాత్రులొచ్చాయి కానీ'' సినిమాకు ప్లస్ అయ్యింది. పాట బాగుంది అంటున్నారు.
Amigos Review
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, బ్రహ్మాజీ కామెడీ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మెప్పించగా, ఎడిటింగ్ పర్లేదని ట్విట్టర్ టాక్.
అమిగోస్ మూవీ (Amigos Review)గురించి కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా వినిపిస్తున్నాయి. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్న డైరెక్టర్ దాన్ని ప్రభావవంతంగా తెరకెక్కించలేకపోయారంటున్నారు. దర్శకుడు అనుభవలేమి సినిమాలో కనిపిస్తుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సైతం ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో విఫలం చెందారని ఆడియన్స్ ఒపీనియన్.
amigos telugu movie teaser Nandamuri Kalyan Ram Mythri Movie Makers
జిబ్రాన్ బీజీఎమ్ కి పెట్టింది పేరు. అమిగోస్ విషయంలో ఆయనకు నెగటివ్ మార్క్స్ పడుతున్నాయి. అమిగోస్ బీజీఎమ్ నిరాశపరిచిందన్న మాట వినిపిస్తోంది. అది సినిమాకు మైనస్ అయ్యిందంటున్నారు. బలహీనమైన స్క్రీన్ ప్లే, ఆసక్తి లేని సన్నివేశాలు ఎక్కువయ్యాయి అంటున్నారు.
మొత్తంగా అమిగోస్ చిత్రానికి డీసెంట్ టాక్ అందుతుంది. ఫుల్ రివ్యూ వస్తే కానీ సినిమా ఫలితం మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. నందమూరి అభిమానులు మాత్రం అమిగోస్ మూవీతో కళ్యాణ్ రామ్ విజయ యాత్ర కొనసాగించారని అంటున్నారు. మరి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కిన అమిగోస్ ఏ స్థాయి హిట్ కొడుతుందో చూడాలి...