ట్రెడిషనల్‌ డ్రెస్‌లో క్యూట్‌ ఫోటోస్‌ షేర్‌ చేసిన కాజల్‌.. రాశీఖన్నా స్వీట్‌ కామెంట్‌..

Aithagoni Raju | Updated : Sep 26 2023, 11:50 AM IST
Google News Follow Us

కాజల్‌ అగర్వాల్‌ టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. స్టార్స్ అందరితోనూ ఒకటి రెండు రౌండ్లు నటించింది. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు గ్లామర్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. 
 

17
ట్రెడిషనల్‌ డ్రెస్‌లో క్యూట్‌ ఫోటోస్‌ షేర్‌ చేసిన కాజల్‌.. రాశీఖన్నా స్వీట్‌ కామెంట్‌..

కాజల్‌ అగర్వాల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో హీరోల సరసన హీరోయిన్‌గా నటించడంతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది. అదే సమయంలో ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌ని గడిపే కాజల్‌.. వృతి పరంగా చాలా ప్రొఫేషనల్‌గా వ్యవహరిస్తుంది. 
 

27

కాజల్‌.. ఆ మధ్య సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. తనకు సంబంధించిన ప్రతి మూమెంట్‌ని పంచుకుంది. తన తనయుడితో ఫోటోలను, గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంది. కానీ అనూహ్యంగా కొంత గ్యాప్‌ వచ్చింది. అడపాదడపాగా పోస్ట్ లు పెడుతుంది. తాజాగా ఎప్పుడు పెట్టినా తన స్పెషాలిటీని చాటుకుంటుంది. 
 

37

ఇప్పుడు తన క్యూట్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ట్రెడిషనల్‌ డ్రెస్‌లో మెరిసింది కాజల్‌. స్లీవ్‌ లెస్‌ గౌనులో హోయలు పోయింది. చిలిపిగా పోజులిస్తూ కట్టిపడేస్తుంది. అయితే ఇందులో తాను మత్య్సకన్యలా ఉన్నానంటూ కాజల్‌ పోస్ట్ పెట్టుకోవడం విశేషం.
 

Related Articles

47

కాజల్‌.. అందాల చందమామగా పాపులర్‌ అయ్యింది. తెలుగు ఆడియెన్స్ గుండెల్లో చందమామగానే ముద్ర వేసుకుంది. ఆమె ఎన్ని పాత్రలు చేసినా `చందమామ` అనే ట్యాగ్‌ మాత్రం వదల్లేదు. అదే ఆమెకి లాంగ్‌ టైమ్‌ గుర్తింపుగా మారిపోయింది. ట్యాగ్ కి తగ్గట్టుగానే ఆమె పాత్రలు, నటన, అందంతో అలరిస్తుంది. 
 

57

కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వచ్చింది కాజల్‌. ఆమె నటిగా ప్రొఫేషనల్‌గా ఉంటూ వచ్చింది. అందుకే ఈ బ్యూటీకి చిత్ర పరిశ్రమలో మంచి రెస్పెక్ట్ కూడా ఉంది. అయితే దాదాపు ఒకటిన్నర దశాబ్దాలపాటు తెలుగు ఆడియెన్స్ అలరించి కోట్లాది మందిని అభిమానులుగా చేసుకుంది.  
 

67

హీరోయిన్ గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా నిలిచింది. దాదాపు అందరు స్టార్స్ తో నటించింది. ఇప్పుడు మిగిలిన వారిని బ్యాలెన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలయ్యతో `భగవంత్‌ కేసరి`లో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

77

దీంతోపాటు `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె పోలీస్‌ అధికారిగా కనిపిస్తుండటం విశేషం. మరోవైపు తమిళంలో `ఇండియన్‌ 2`లోనూ నటిస్తుంది. ఇలా సీనియర్లని ఓ రౌండ్‌ చుట్టేస్తుందీ బ్యూటీ. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos