కాజల్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో మగధీర ముందు వరుసలో ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ మిత్రవింద పాత్రలో అదరహో అనిపించింది. రొమాంటిక్ గా ఎమోషనల్ గా కాజల్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం తన జనరేషన్ లో రాంచరణ్ తన ఫేవరిట్ యాక్టర్ అని కాజల్ పేర్కొంది. వీళ్ళిద్దరూ మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు లాంటి చిత్రాల్లో నటించారు.