జూ ఎన్టీఆర్.. నందమూరి హరికృష్ణ, శాలిని లకు 1983 మే 20న జన్మించారు. 1991లో `బ్రహ్మర్షి విశ్వామిత్ర` చిత్రంతో బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. బాల రామాయణంలో రాముడిగా నటించి జాతీయ అవార్డుని అందుకున్నాడు. `స్టూడెంట్ నెం 1`తో వెండితెరకు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్.. `ఆది`, `సింహాద్రి`, `యమదొంగ`, `అదుర్స్`, `టెంపర్`, `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజ్`, `జై లవకుశ`, `అరవింద సమేత వీరరాఘవ`, `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రాలతో మెప్పించారు.