వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల నా కెరీర్ పై, జీవితంపై ప్రభావం చూపుతోంది. నిజమే.. నాకు పెళ్ళై చాలా ఏళ్ళు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. పిల్లల కోసం నేను, నా ఫ్యామిలీ ఎంతగానో ఎదురుచూస్తున్నాం. కానీ నేను ఇప్పుడు గర్భవతిని కాదు. కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల నిజంగానే నేను గర్భవతిని అని.. కొన్ని షోలు ఇక చేయనేమో అని భావిస్తున్నారు.