తల్లయ్యాక కాజల్ ఫస్ట్ ఫోటో షూట్... ఈ హాట్ పోజులు చూస్తుంటే కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ తప్పేలా లేదుగా..!

Published : May 07, 2022, 03:35 PM ISTUpdated : May 07, 2022, 03:41 PM IST

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల మగబిడ్డకి జన్మినచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఫోటో షూట్‌కి పోజులిచ్చి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. తన ఫిట్‌నెస్‌ని చాటుకుంటూ కుర్ర హీరోయిన్లకి సందేశాన్నిస్తుంది. 

PREV
16
తల్లయ్యాక కాజల్ ఫస్ట్ ఫోటో షూట్... ఈ హాట్ పోజులు చూస్తుంటే కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ తప్పేలా లేదుగా..!

కాజల్‌ అగర్వాల్‌(Kajal Aggarwal) గత నెల(ఏప్రిల్‌) 19న మగబిడ్డకి జన్మనిచ్చింది. చిన్నారికి `నీల్‌ కిచ్లు` అంటూ నామకరణం కూడా చేశారు. బిడ్డ పుట్టిన వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా పేరు పెట్టి సర్‌ప్రైజ్‌ చేశారు. ఆ నెక్ట్స్ డే తన ముద్దుల చిన్నారికి ప్రేమతో ముద్దు పెడుతూ కాజల్‌ ఫోటోని షేర్‌ చేసింది. అయితే కుమారుడిని పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడింది. ఆ ఫోటో మాత్రం వైరల్‌ అయ్యింది. 

26

బిడ్డ పుట్టాక ఇప్పుడు ఫస్ట్ ఫోటోని పంచుకుంది కాజల్‌(Kajal). గ్లామర్‌గా ముస్తాబై హోయలు పోయింది. సింగిల్‌ పోజులో దిగిన ఓ పిక్‌ని ఆమె ఇన్‌స్టాలో పంచుకోగా అది ట్రెండింగ్‌ అవుతుండటం విశేషం. గ్రీన్‌ కలర్‌, ఎల్లో మేళవింపులో ఉన్న డ్రెస్‌లో వయ్యారాలు పోయింది కాజల్‌. కాస్త థై షోతో హాట్‌ పోజులిచ్చింది. చూడబోతే తగ్గేదెలే అని సిగ్నల్‌ ఇస్తున్నట్టుగా ఉందంటున్నారు నెటిజన్లు. 

36

ఈ సందర్భంగా కాజల్‌ పెట్టిన పోజు కూడా హాట్‌ టాపిక్‌ అవుతుంది. `ఫీలింగ్‌ లైక్‌ సమ్మర్‌`, `రైజింగ్‌ టెంపరేచర్‌` అంటూ రెండు యాష్‌ ట్యాగ్‌లను పంచుకుంది. సమ్మర్‌లో వేడిపుట్టిస్తున్నట్టు అర్థం వచ్చేలా పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. కాజల్‌ ఇకపై సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతుందనే ప్రచారం జరిగింది. ఇకపై ఆమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం కావాలని ప్లాన్‌ చేసుకున్నట్టు సమాచారం. గౌతమ్‌ కిచ్లుతో మ్యారేజ్‌ తర్వాత కొత్తగా వ్యాపారంలోకి కూడా దిగారు. ఈ నేపథ్యంలో పిల్లలు, ఫ్యామిలీ, వ్యాపారం చూసుకునేలా ప్లాన్‌ చేసుకుంటున్నట్టు టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

46

ఆమె సినిమాల నుంచి తప్పుకోబోతుందనే వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న క్రమంలో కాజల్‌ ఇలాంటి స్టన్నింగ్‌ ఫోటోని పంచుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగానే కాజల్‌ సినిమాలను వదిలేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బిడ్డ పుట్టి 20 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఫోటో షూట్‌ చేయడం, ఇందులో హాట్‌ లుక్‌లో కనిపించిందంటే నమ్మేలా లేదు. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇచ్చినట్టుగా ఉందంటున్నారు నెటిజన్లు. మరి ఏం చేయబోతుందనేది మున్ముందు తేలనుంది. 

56

బాలీవుడ్‌లో కరీనా కపూర్‌ తల్లి అయిన తర్వాత కూడా సినిమాలు చేసింది. ఇటీవల రెండో బిడ్డకి జన్మనిచ్చా కూడా మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కాజల్‌ సైతం అలానే ప్లాన్‌ చేసుకుంటుందా? లేదంటే సినిమా పరిశ్రమ నుంచి దూరంగా ఉంటుందా? అనేది చూడాలి. 

66

కాజల్‌ తెలుగులో విశేషం గుర్తింపు తెచ్చుకుంది. సుమారు అరవై సినిమాల్లో నటించిన ఆమె తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడింది. అత్యంత పారితోషికం అందుకునే కథానాయికగా ఎదిగింది. కమర్షియల్‌ హీరోయిన్‌ కి కేరాఫ్‌గా నిలిచింది కాజల్‌. చివరగా ఆమె తెలుగులో `మోసగాళ్లు` చిత్రంలో నటించింది. తమిళంలో `హే సినామిక`లో మెరిసింది. ఈ చిత్రాలు పరాజయం చెందాయి. చిరంజీవితో `ఆచార్య`లోనూ హీరోయిన్‌గా చేసింది. కానీ పాత్ర నిడివి తక్కువ ఉండటం, ఆ టైమ్‌లోనే కాజల్‌ గర్బవతి అయిన నేపథ్యంలో ఇందులోనుంచి ఆమె పాత్రని తొలగించారు. అయినప్పటికీ ఈ చిత్రం పరాజయం చెందడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories