Kajal Aggarwal: 100 అడుగుల క్రేన్ మీద పడుతుంటే ఒక చెయ్యి నన్ను లాగింది, కాజల్ అగర్వాల్ షాకింగ్ స్టోరీ

Published : Nov 15, 2026, 11:00 AM IST

Kajal Aggarwal Shocking Incident : 2020లో కమల్ హాసన్ 'ఇండియన్ 2' షూటింగ్‌లో జరిగిన ఘోరమైన క్రేన్ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన సంఘటనను నటి కాజల్ అగర్వాల్ పంచుకున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? కాజల్ ఎలా బయటపడింది?

PREV
14
షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదం

2020లో జరిగిన 'ఇండియన్ 2' సినిమా సెట్‌లో ఆ ఘోరమైన క్రేన్ ప్రమాదం నుంచి తాను ఎలా ప్రాణాలతో బయటపడిందో కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా గుర్తుచేసుకున్నారు. 100 అడుగుల ఎత్తైన క్రేన్ తన మీద పడుతుండగా ఎవరో ఒక అదృశ్య చెయ్యి తనను వెనక్కి లాగి కాపాడిందని ఆమె చెప్పారు. ఆ రోజు సెట్‌లో జరిగిన ఆ మరణ భయం నుంచి తాను ఎలా తప్పించుకుందో అన్న విషయాన్ని చాలా ఎమోషనల్‌గా వెల్లడించారు.

క్రేన్ కింద పడటానికి కొన్ని సెకన్ల ముందు ఒక 'మిస్టీరియస్ హ్యాండ్' తనను లాగిందని ఆమె అన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ దారుణమైన ఘటన 2020 ఫిబ్రవరిలో చెన్నై దగ్గర ఉన్న ఈవీపీ ఫిల్మ్ సిటీలో నైట్ షూట్ జరుగుతున్నప్పుడు జరిగింది. కమల్ హాసన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్పుడే ఆపేశారు.

24
సెట్‌లో అసలు ఏం జరిగింది?

హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో ఆ భయంకరమైన రాత్రి జరిగిన సంఘటనను కాజల్ అగర్వాల్ వివరించారు. మామూలుగా జరుగుతున్న షూటింగ్ సడెన్‌గా పెద్ద ప్రమాదంగా ఎలా మారిందో ఆమె చెప్పారు. ప్రమాదం జరిగే టైంకి ఆమె 80 ఏళ్ల క్యారెక్టర్ కోసం ప్రోస్థెటిక్ మేకప్‌లో ఉన్నారు. అప్పుడే సెట్‌లో సడెన్‌గా భయంకరమైన వాతావరణం ఏర్పడింది.

అందరూ భయంతో పరిగెడుతుంటే, కాజల్ మానిటర్ పక్కన ఉన్న టేబుల్ దగ్గర పడిపోయారు. భయంతో ఆమెకు అక్కడి నుంచి కదలలేకపోయారు. పైకి చూస్తే, 100 అడుగుల ఎత్తులో ఉన్న క్రేన్ బ్యాలెన్స్ తప్పి నేరుగా తన మీదే పడుతుండటం చూశానని చెప్పారు.

34
'ఒక చెయ్యి నన్ను లాగింది'

ప్రమాదం నుంచి తాను బయటపడిన విధానం గురించి కాజల్ మాట్లాడుతూ, "అది న్యూస్‌లో కూడా వచ్చింది. ఇండియన్ 2 సెట్‌లో జరిగిన పెద్ద ప్రమాదం. 100 అడుగుల క్రేన్ పడిపోయి సెట్‌లో ఉన్న ముగ్గురు చనిపోయారు. ఆ ప్లేస్‌లో ఫస్ట్ నేనే చనిపోవాల్సింది. ఎలా బతికిపోయానో నాకే తెలీదు. కానీ నిజం చెప్తున్నా, ఒక చెయ్యి నన్ను అక్కడి నుంచి వెనక్కి లాగింది" అని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు.

క్రేన్ పడిపోవడానికి కొద్దిసేపటి ముందు ఎవరో తనను లాగినట్టు అనిపించిందట. కానీ ఎవరు కాపాడారో అని చుట్టూ చూస్తే తన టీమ్‌లో ఎవరూ పక్కన లేరు. ఈ ఘటనతో ఆమె నమ్మకం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాతే కృష్ణ భగవానుడికి పెద్ద భక్తురాలిగా మారిపోయానని ఆమె అన్నారు.

44
ప్రాణనష్టం - ఆర్థిక సాయం

ఈ ప్రమాదంలో క్రేన్ పడిన ప్లేస్‌కు దగ్గరలో ఉన్నవాళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలామందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కృష్ణ, చంద్రన్, మధు అనే ముగ్గురు చనిపోగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. చనిపోయినవాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు అని గుర్తించారు. గాయపడిన తొమ్మిది మందికి వెంటనే మెడికల్ ట్రీట్‌మెంట్ అందించారు.

ఈ సంఘటన సినీ ఇండస్ట్రీలో పెద్ద కలకలం సృష్టించింది. సెట్‌లో పెద్ద ఎక్విప్‌మెంట్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన సేఫ్టీ గురించి చాలా చర్చ జరిగింది. ప్రమాదంలో చనిపోయినవాళ్లకు, వాళ్ల ఫ్యామిలీలకు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. హీరో కమల్ హాసన్, ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ చెరో 1 కోటి రూపాయలను చనిపోయిన కృష్ణ, చంద్రన్, మధు కుటుంబాలకు, గాయపడినవాళ్లకు ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories