Krithi Shetty : వాళ్ల దెబ్బకి.. తెలుగులో పట్టుకోల్పోయిన కృతిశెట్టి? కోలీవుడ్ లో మాత్రం దుమ్ములేపుతున్న బేబమ్మ

First Published | Dec 16, 2023, 4:56 PM IST

ప్రస్తుతం కృతి శెట్టి (Krithi Shetty) కోలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. తాజాగా మరోసినిమాను ప్రకటించింది. కానీ తెలుగులో ఉప్పెన్ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు లేవు. వాళ్ల దెబ్బతో బేబమ్మ క్రేజ్ తగ్గిపోతుందనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. 

టాలీవుడ్ లో ‘ఉప్పెన’ చిత్రంతో దూసుకొచ్చింది కృతి శెట్టి. తొలిసినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ వెంటనే ‘బంగర్రాజు’, ‘శ్యామ్ సింగరాయ్’తోనూ హిట్ అందుకుంది బేబమ్మ. 
 

వరుసగా మూడు సినిమాలతో హిట్ అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ గా నిలిచింది. దీంతో ఆమె పదేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఊపూపుందనే వైబ్ తీసుకొచ్చింది. కానీ కొత్త హీరోయిన్ల సందడి పెరగడంతో కృతికి ఊహించని విధమైన సవాళ్లు ఏర్పడ్డాయి.  


ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ గా మారిన శ్రీలీలా (Sreeleela), మీనాక్షి చౌదరి (meenakshi chaudhary)తో కృతి క్రేజ్ తగ్గినట్టు కనిపిస్తోంది. ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, కావ్య కళ్యాణ్ రామ్ వంటి హీరోయిన్లు కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. 

మరోవైపు బేబమ్మకూ వరుసగా ఫ్లాప్స్ పడటంతో దర్శకనిర్మాతల నుంచి స్పందన తగ్గించింది. తను ఎంచుకున్న సినిమా ఫలితాలతో క్రమంగా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో కృతిశెట్టి కోలీవుడ్ లో దుమ్ములేపుతోంది వరుసగా అవకాశాలు అందుకుంటోంది. 

ఓవైపు పలు ఓపెనింగ్స్ కు వెళ్తూ ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది. మరోవైపు తెలుగులో పట్టుకోల్పోయినా... తమిళంతో మాత్రం క్రేజీ హీరోయిన్ గా మారింది. రీసెంట్ గానే ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో కలిసి నటించబోతున్నట్టు ప్రకటించింది. మరిన్ని సినిమాల్లో నటిస్తోంది. 

ప్రదీప్ రంగనాథన్ - కృతిశెట్టి కాంబోలో ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’ రూపుదిద్దుకుంటోంది. స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్జే సూర్య కృతికి తండ్రిగా నటిస్తున్నారు. ఇక కీర్తి..     Vaa Vaathiyaare, Genie, Sharwa35 వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది. 
 

Latest Videos

click me!