ఆయనతో రొమాంటిక్ పిక్స్ పబ్లిక్ గా పంచుకున్న కాజల్, పెళ్ళై ఆరునెలలు అవుతున్న అదే జోరు!

First Published May 28, 2021, 3:36 PM IST

కాజల్ అగర్వాల్ తన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లి, పెళ్లి చేసుకొని మరొకరి సొంతమై ఆరునెలలు దాటిపోతుంది. 2020 అక్టోబర్ లో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లును వివాహం చేస్తున్నారు. కరోనా నిబంధనల మధ్య అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. 

హనీమూన్ కోసం దీవుల దేశం మాల్దీవ్స్ చెక్కేసిన ఈ జంట, దాదాపు నెల రోజు హద్దులు లేని ఏకాంతాన్ని అనుభవించారు. షూటింగ్స్ కూడా లేకపోవడంతో ఎటువంటి టెన్సన్స్ లేకుండా ఫుల్ గా హనిమూన్ జరుపుకున్నారు.
undefined
చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండే కాజల్ ఏ కొంచెం విరామం లభించినా కిచ్లు వడిలో వాలిపోతుంది. షార్ట్ వీకెండ్ వెకేషన్స్, లేదా షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. పెళ్ళైన ఈ ఆరునెలల్లో అనేక ప్రదేశాలకు కాజల్, కిచ్లు విహారాలకు వెళ్లారు.
undefined
దాదాపు పదేళ్ల స్నేహం, ప్రేమ తరువాత మనసు పడి కోరుకున్నవాడిని కట్టుకున్న కాజల్ అతనితో అపరిమిత ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నారు. వీరి సోషల్ మీడియా పోస్ట్స్ దీనికి  రుజువని చెప్పవచ్చు.
undefined
తాజాగా కాజల్ భర్త కిచ్లుతో హ్యాపీగా గడుపుతున్న ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అద్భుతమైన ఏకాంత వేళ కిచ్లు వడిలో కూర్చొని రొమాన్స్ ఎంజాయ్ చేస్తుంది కాజల్. కిచ్లు హగ్స్ , కిస్సులతో ఆమెను ముంచెత్తుతుంటే ఆనందంలో తేలియాడుతుంది.
undefined
కిచ్లుతో రొమాంటిక్ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ మరింత ఈర్ష్య పడేలా చేసింది కాజల్. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కిచ్లు అదృష్టానికి కుళ్ళుకుంటున్నారు.
undefined
మరోవైపు పెళ్లికి ముందు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సివుంది కాజల్. తెలుగులో చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
undefined
వీటితో పాటు తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను చిత్రాల వరకు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ మధ్య లైవ్ టెలికాస్ట్ అనే హారర్ సిరీస్ లో నటించి డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది.
undefined
స్టార్ హీరోయిన్ గా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూనే భర్త వ్యాపార అభివృద్ధికి కాజల్ కృషి చేస్తుంది. గౌతమ్ నిర్వహిస్తున్న ఫర్నిచర్ సంస్థ ఉత్పత్తుల ప్రచార కర్తగా పనిచేస్తూ, వాటికి ప్రచారం కల్పిస్తుంది. అన్ని విధాల అనుకూలమైన భార్యను తెచ్చుకున్న కిచ్లు అదృష్టానికి ఎవరైనా ఈర్ష్య పడాల్సిందే.
undefined
click me!