లక్షల అభిమానుల గుండెలు బద్దలైన వేళ... కాజల్ బర్త్ డే స్పెషల్, ఆమె ప్రేమ, పెళ్లి సంగతులు!

First Published Jun 19, 2021, 3:56 PM IST

కాజల్ అగర్వాల్ పెళ్లి వార్త లక్షల మంది అభిమానుల గుండెలకు గాయం చేసింది. ఎటువంటి చప్పుడు లేకుండా, నా పెళ్లి అంటూ షాకిచ్చింది కాజల్ అగర్వాల్. కోరుకున్న ప్రియుడితో నిశితార్థం , పెళ్లి చక చకా జరిగిపోయాయి. కాజల్ పెళ్లి తరువాత మొదటి బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కాజల్-గౌతమ్ కిచ్లు ల పెళ్లి కహాని ఒకసారి గుర్తు చేసుకుందాం.. 
 

కాజల్, గౌతమ్ కిచ్ల్లులది దాదాపు ఏడేళ్ల పరిచయం. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరు కలవడం జరిగింది. వీరిది లవ్ యట్ ఫస్ట్ సైట్ కాదు. పరిచయం ద్వారా మెల్లగా అల్లుకున్న బంధం.
undefined
గత మూడేళ్ళుగా కాజల్, గౌతమ్ డేటింగ్ స్టార్ట్ చేశారు. కలిసి పార్టీలు చేసుకోవడం, విహారాలు వెళ్లడం చేశారు. గౌతమ్ తో కాజల్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి వచ్చినా, గౌతమ్ సెలబ్రిటీ కాకపోవడంతో ఎవరికీ వీరి డేటింగ్ గురించి అనుమానం రాలేదు.
undefined
లాక్ డౌన్ పరిస్థితులు కాజల్, గౌతమ్ లను పెళ్ళికి పురిగొల్పాయి. వారాల తరబడి దూరంగా ఉండడం వీరి వల్ల కాలేదట. ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని గ్రహించిన కాజల్, గౌతమ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
undefined
పెద్దల అంగీకారం కూడా కుదరడంతో గౌతమ్ కిచ్లు, కాజల్ జూన్ లో నిశ్చితార్థం జరుపుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా వీరి నిశితార్థం జరిగింది.
undefined
నిశ్చితార్థం జరిగిన నాలుగు నెలలకు అక్టోబర్ 30వ తేదీన కాజల్, గౌతమ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్ళిలో కాజల్ పెళ్లి దుస్తులలో మెరిసిపోయారు.
undefined
ఇక పెళ్ళైన వెంటనే కాజల్-గౌతమ్ లాంగ్ హనీమూన్ ట్రిప్ సెట్ చేసుకున్నారు. మాల్దీవ్స్ వెళ్లిన ఈ జంట దాదాపు నెలరోజులు ఏకాంతంగా ఎంజాయ్ చేశారు. షూటింగ్స్ కూడా లేకపోవడంతో ప్రశాంతంగా హనీమూన్ జరుపుకున్నారు కాజల్.
undefined
పెళ్ళైన నాటి నుండి ఖాళీ సమయం దొరికితే విహారాలకు చెక్కేస్తారు కాజల్, గౌతమ్. హీరోయిన్ గా బిజీగా ఉంటూనే భర్త వ్యాపారానికి ప్రచార కర్తగా వ్యవహరిస్తూ అతనికి సహాయం చేస్తుంది కాజల్.
undefined
click me!