వర్మతో ఎఫైర్ గురించి ఓపెన్ గా మాట్లాడిన అరియనా... మీరు కలియుగ కృష్ణుడు అంటూ..

First Published Jun 19, 2021, 1:51 PM IST

దర్శకుడు వర్మ, అరియనా బోల్డ్ ఇంటర్వ్యూ విడుదలైపోయింది. గంటల వ్యవధిలో వేలమంది ఈ ఇంటర్వ్యూ వీక్షించారు. వర్మ తత్త్వానికి, టైటిల్ కి తగ్గట్లే ఆద్యంతం బోల్డ్ గా సాగింది వర్మ-అరియనా ఇంటర్వ్యూ.

సెక్స్, ఎమోషన్స్, అఫైర్స్, రూమర్స్, లవ్, ఫిగర్ ఇలాంటి బోల్డ్ టాపిక్స్ అన్నీ టచ్ చేశారు వీరిద్దరూ. బిగ్ బాస్ వంటి పెద్ద షోకి ఎంపిక కావడానికి మీరే అంటూ వర్మకు థాంక్స్ చెప్పారు అరియనా. మన మొదటి ఇంటర్వ్యూలో మీరు నాపై చేసిన బోల్డ్ కామెంట్ వైరల్ కావడం వలనే నేను ఫేమస్ అయ్యానని అరియనా ఒప్పుకుంది.
undefined
నాకు అనిపించింది చెప్పాను, అందులో నా క్రెడిట్ ఏమీ లేదని వర్మ సింపుల్ గా తీసుకున్నారు. నాకోసం మీరు బిగ్ బాస్ షో చూశారట. అలాగే ట్వీట్ కూడా చేశారు. మరోమారు థాంక్స్ అని చెప్పింది అరియనా.
undefined
నేను సన్నీ లియోన్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఆమె అభిమానిగా బిగ్ బాస్ చూశాను. ఇక నీ విషయానికి వస్తే నిన్ను చూడడం నాకు ఇష్టం, ఐతే నిన్ను చూడడం కోసం మిగతా పదిహేను వెధవ మొహాలను చూడడం నాకు ఇష్టం ఉండదని వివాదాస్పద కామెంట్ చేశాడు వర్మ.
undefined
మీరు నాకు సప్పోర్ చేస్తూ ట్వీట్ చేయడం, మనం కలవడం చూసి కొందరు మన మధ్య ఎఫైర్ ఉందని అనుకుంటున్నారు సార్.. దీనిపై మీ స్పందన ఏంటని, అరియనా అడుగగా.. అది పెద్ద జోక్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ కోసం ఇలాంటివి అనుకుంటూనే ఉంటారని వర్మ అన్నారు.
undefined
ఇలాంటి అఫైర్స్ రూమర్స్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఏం చేయాలని అడుగగా.. నచ్చినది, అనిపించింది చేయడమే... ఎవరి గురించో ఆలోచించ కూడదని వర్మ మరో బోల్డ్ ఆన్సర్ చెప్పాడు.
undefined
గతంలో నేను పొట్టి దుస్తులలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం వలన మీరు బోల్డ్ కామెంట్ చేశారని... ఆ తరువాత కూడా కొందరు యాంకర్స్  అదే తరహాలో చిన్న చిన్న బట్టలు ధరించి ఇంటర్వ్యూ చేశారు. వాళ్లపై మీరు నాపై చేసిన కామెంట్ చేయలేదు కారణం... ఏమిటని అడుగగా..
undefined
నాకు అనిపిస్తే చెప్తాను కానీ, ఆ ఫీల్ కలగనిదే చెప్పను. నిన్ను చూసినప్పుడు నాకు అనిపించింది చెప్పాను. మరొకరు నీలానే షార్ట్ డ్రెస్ లో కనిపించినా నాకు ఫీల్ కలగకపోవచ్చు అంటూ వర్మ సమాధానం చెప్పాడు.
undefined
ఇక అరియనా నీ ఫిగర్ సూపర్ పర్ఫెక్ట్ గా ఉంది. కానీ నువ్వు జిమ్ చేయనని చెబుతున్నావు. జిమ్ చేయకుండా ఇలాంటి సెక్సీ ఫిగర్ ఎలా సాధ్యం.. నువ్వు అబద్దం చెబుతున్నావని వర్మ ఆమెను మరలా పొగిడేశారు
undefined
click me!