
సెలబ్రిటీల లైఫ్ అంతా తేలిగ్గా ఉండదు.. లగ్జరీ లైఫ్ ఎంజాయ చేస్తారని అంతా అనుకుంటారు కాని.. ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటాయి. కొన్ని సమస్యలు బయటకు కనిపిస్తే.. మరికొన్ని సమస్యలు కనిపించకుండా ఇబ్బంది పెడతాయి. తను కూడా అలాంటి ఇబ్బందినే పేస్ చేశానంటోంది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.
ఒకప్పుడంటే స్టార్స్ తమకున్న ఆరోగ్య సమస్యల గురించి, ఇతర భయాల గురించి బయటకి పెద్దగా చెప్పేవారు కాదు.. ముఖ్యంగా హీరోయిన్లు. పైకి బాగానే కనిపించినా లోలోపల ఏవో సమస్యలతో ఇబ్బంది పడుతుడేవారు. కాని ఇప్పుడు సోషల్ మీడియా విసృతంగా వచ్చిన తరువాత.. స్టార్లు తమ అభిమాప్రాయాలను నేరుగా తమ అభిమానులకు చుప్పేస్తున్నారు. అలానే కాజల్ తన అభిప్రయాలను తనకు ఉన్న ఇబ్బందులు ఫ్యాన్స్ తో పంచుకుంది.
బాలీవుడ్ లో దీపికా, ప్రియాంక, విద్యాబాలన్ లాంటి హీరోయిన్లు వారు అనుభవించిన మానసిక పరిస్థితుల గురించి కొన్నిసమయాల్లో ఓపెన్ అయ్యారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కాజల్ కూడా.. తనరీసెంట్‌గా సీనియర్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ తను కూడా డిప్రెషన్‌కి గురయ్యానంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రీసెంట్‌గా నెటిజన్లతో చిట్ చాట్ చేసింది కాజల్.. తను ఫేస్ చేసిన డిప్రెషన్ గురించి చెప్పుకొచ్చింది.. ఆమె మాట్లాడుతూ.. డెలివరీ తర్వాత నేను కూడా డిప్రెషన్‌కి గురయ్యా. అది సర్వసాధారణ విషయం. మహిళలు ఎవరైనా సరే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో బాధపడితే ఫ్యామిలీ అండగా నిలబడాలి. అలాగే ఆడవాళ్లు పిల్లలు పుట్టిన తర్వాత తమకంటూ కొంత టైం కేటాయించుకోవాలి. నలుగురుతో పరుగులు తీయ్యకుండా తమ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవాలి అన్నారు.
ఇక కాజల్ తన విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసినట్టు చెప్పుకొచ్చింది. తాను కూడా ఈ విషయంలో.. ట్రైనర్ సాయంతో వర్కౌట్స్ చేయడం, ఇష్టమైన వారితో సయమాన్ని గడపడం.. ఇలా కొన్ని పనుల ద్వారా డిప్రెషన్ నుండి బయటపడ్డానంటోది. అయితే తనకు మంచి కుటుంబం దొరికిందన్నారు.
నన్ను ఎంతగానో అర్థం చేసుకునే కుటుంబం ఉండడం నా అదృష్టం. అందుకే డిప్రెషన్ నుంచి నేను త్వరగా బయటపడ్డాను. డిప్రెషన్ టైంలో నా వల్ల భర్త గౌతమ్ కిచ్లు చాలా క్లిష్టమైన పరిస్థితులు చూశారు.. అని చెప్పుకొచ్చింది కాజల్.ఇక ప్రస్తుం కాజల్ ఆరోగ్యంగా ఉంది. వరుసగా సినిమాలు చేస్తోంది. తొలిసారి బాలకృష్ణ పక్కన భగవంత్ కేసరి లో నటిస్తుంది. ఇండియన్ 2 తో పాటు సత్యభామ, ఉమ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తోనూ బిజీగా ఉంది.
ఇప్పటికే 50 సినిమాలు చేసి హాఫ్ సెంచరీ రికార్డ్ సాధించింది కాజల్. కుర్ర హీరోలు.. సీనియర్ అనే తేడా లేకుండా తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేసింది. 2020లో బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడి, ఓ బాబుకి జన్మనిచ్చింది. కొద్ది కాలం ఫ్యామిలీతోనే కాలం గడిపింది. పెళ్లి తర్వాత కూడా ఆఫర్స్ వస్తుండడంతో తిరిగి సినిమాలు చేస్తుంది.
దర్శకుడు తేజ లక్ష్మీకళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్‌ని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత చిన్నా చితకా సినిమాలు చేసింది కానీ మగధీర తో దశ తిరిగిపోయింది. తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.