పదునెక్కిన కాజల్‌ అందాలు.. బార్బీ డాల్‌లా మెరిసిపోతూ విజువల్ ట్రీట్‌.. అతిలోక సుందరి దిగివచ్చిందా?

Published : Jul 26, 2023, 11:21 PM ISTUpdated : Jul 27, 2023, 10:40 AM IST

కాజల్‌ అగర్వాల్‌ తల్లి అయిన తర్వాత తనలోని అసలు ఘాటుని చూపిస్తుంది. అందాల ఘాటుని ఆవిష్కరిస్తుంది. గ్లామర్‌ డోస్ పెంచుతూ పిచ్చెక్కిస్తుంది. అదే సమయంలో సినిమాల పరంగానూ దూకుడు పెంచుతుంది.   

PREV
18
పదునెక్కిన కాజల్‌ అందాలు.. బార్బీ డాల్‌లా మెరిసిపోతూ విజువల్ ట్రీట్‌.. అతిలోక సుందరి దిగివచ్చిందా?

కాజల్‌ అగర్వాల్‌ సెకండ్‌ ఇన్సింగ్స్ లో దూసుకుపోతుంది. ఓ వైపు స్టార్‌హీరోలతో సినిమాలు చేయడంతోపాటు మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు శ్రీకారం చుడుతుంది. తనలోని నట విశ్వరూపం చూపించేందుకు వస్తుంది. 
 

28

ఓ వైపు నటిగా విశ్వరూపం చూపించడమే కాదు, అందాల విశ్వరూపం కూడా చూపిస్తుంది. తన అందాల్లోని అసలైన ఘాటుని ఇప్పుడు ఆవిష్కరిస్తుంది కాజల్‌. నెవర్‌ బిఫోర్‌ హాట్‌ నెస్తో మైండ్ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాని దున్నేస్తున్నాయి. 
 

38

ఇందులో పదునెక్కిన అందాలతో కాజల్‌ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. అతిలోక సుందరి దిగి వచ్చిందా అనేట్టుగా ఆమె గ్లామర్ షో చేస్తుంది. భారీ డిజైనింగ్‌ వేర్‌లో అందాల రాజహంసలా, రాజకుమారిలా కనిపిస్తుంది కాజల్‌. చూపు తిప్పుకోలేని అందంతో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. 
 

48

కాజల్‌ అగర్వాల్ దాదాపు రెండు దశాబ్దాలపాటు హీరోయిన్ గా రాణిస్తుంది. స్టార్‌ హీరోయిన్‌ గా రాణిస్తుంది. అత్యంత పారితోషికం అందుకునే హీరోయిన్‌గానూ నిలిచింది. ఎంతో మంది హీరోయిన్లు తనకు పోటీగా వచ్చినా, తన ప్లేస్‌ పదిలమే అని చాటుకుంది. అంతే దీటుగా ఎదుర్కొంది. నిలబడింది. 

58

కాజల్‌.. కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచింది. పాత్ర పరిధితో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. గ్లామర్‌ ట్రీట్‌తో ఆకట్టుకుంది. ముద్దు ముద్దు మాటలు, క్యూట్‌ అందాలతోనూ అలరించింది. అదే సమయంలో తనలోని హాట్‌ యాంగిల్స్ ని కూడా ఆవిష్కరించింది. ఐటెమ్‌ సాంగ్‌లు కూడా చేసింది కాజల్‌. నటిగా ఊపేయడంతోపాటు డాన్సులతో అలరించింది. 
 

68

కాజల్‌ తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేసింది. అక్కడ కూడా ఇదే స్థాయి ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. కానీ తమిళం కంటే తెలుగులోనూ ఈ బ్యూటీకి సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అంతేకాదు తెలుగునే తన హోమ్‌ ల్యాండ్‌గా భావిస్తుంది. తెలుగు ఆడియెన్స్ వల్లే తాను  ఈ స్థాయిలో ఉన్నానని చెబుతుంది కాజల్‌. 

78

తాను సినిమాలు మానేస్తున్నట్టు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించింది. సినిమాలు మానేయడం లేదని, నటిస్తూనే ఉంటానని, మీ ప్రేమ ఉన్నంత వరకు సినిమాలు చేస్తానని తెలిపింది. ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీ `సత్యభామ` చిత్రంలో నటిస్తుంది. ఆమె నటిస్తున్న మొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. చిత్రీకరణ జరుపుకుంటోంది.
 

88

దీంతోపాటు తొలిసారి బాలకృష్ణతో కలిసి `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటిస్తుంది. సీనియర్లలో కేవలం చిరంజీవితోనే చేసింది కాజల్‌. ఇప్పుడు సీనియర్లకి ఆమె కేరాఫ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే అటు తమిళంలోనూ కమల్‌ హాసన్‌తో `ఇండియన్‌ 2` చేస్తుంది కాజల్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories