షాహిద్ కపూర్ బాలీవుడ్‌లో పెద్ద స్టార్ కాదు, చిన్న స్టార్ కాదు అంటారు. పద్మావత్ తర్వాత ఫ్లాపుల్లో ఉన్న షాహిద్ కపూర్‌కు 'కబీర్ సింగ్' పెద్ద హిట్ ఇచ్చింది. కబీర్ సింగ్ ఒక బిజినెస్ మేన్ కొడుకు. మెడికల్ స్టూడెంట్ అయిన కబీర్‌కు తన జూనియర్ ప్రీతి మీద లవ్ అవుతుంది.
ప్రీతికి కూడా కబీర్ అంటే ఇష్టం. ప్రీతికి పాఠాలు చెబుతూనే ఆమెను ప్రేమిస్తాడు. ఆమెను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేనంత పిచ్చిగా ప్రేమిస్తాడు. సినిమాలో రొమాంటిక్ సీన్స్, కబీర్ సింగ్ కోపం, ప్రేమలోని స్వచ్ఛత ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి.
ఎక్కువ తాగుడు, కోపం వల్ల ఇద్దరి ప్రేమ ఎలా దూరమవుతుందో సందీప్ వంగా రెడ్డి తెరపై అద్భుతంగా చూపించారు. 2 గంటల 52 నిమిషాల సినిమా ఇది. యూత్ కి బాగా నచ్చుతుంది. అందమైన ప్రేమను చాలా దారుణంగా చూపించారని కూడా అన్నారు.