థియేటర్లో `సలార్‌`ని దెబ్బకొట్టి ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతున్న `కాటేరా`.. ఎందులో అంటే?

Published : Feb 11, 2024, 10:31 AM ISTUpdated : Feb 11, 2024, 11:02 AM IST

కన్నడ స్టార్‌ దర్శన్‌ నటించిన `కాటేరా` సినిమా థియేటర్లో దుమ్మురేపింది. ఇది ఏకంగా ప్రభాస్‌ `సలార్‌`ని ఢీ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలో రచ్చ చేస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది.   

PREV
15
థియేటర్లో `సలార్‌`ని దెబ్బకొట్టి ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతున్న `కాటేరా`.. ఎందులో అంటే?

డీ బాస్‌ దర్శన్‌ హీరోగా నటించిన `కాటేరా` చిత్రం గతేడాది డిసెంబర్‌ చివరి వారంలో విడుదలైంది. అప్పటికే థియేటర్లలో ప్రభాస్‌ `సలార్‌` మూవీ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దుమ్మురేపుతుంది. భారీ వసూళ్లని రాబడుతుంది. అలాంటి జోరు మీదున్న `సలార్‌`కి దెబ్బ కొట్టింది `కాటేరా`. దర్శన్‌ నటించిన ఈ మూవీ కేవలం కన్నడలోనే విడుదలై అక్కడి బాక్సాఫీసుని షేక్‌ చేసింది. కన్నడలో `సలార్‌`ని గట్టిగా కొట్టింది. 
 

25

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వందకోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. దర్శన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్టెడ్‌ మూవీగా నిలిచింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల్లో నిలిచింది. కన్నడ చిత్ర పరిశ్రమకి గతేడాది పర్‌ఫెక్ట్ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది. కన్నడ మార్కెట్‌ వర్గాలు కూడా ఆశ్చర్యపోయేలా ఈ మూవీ కలెక్షన్ల దుమ్మురేపడం విశేషం.

35

ఇక ఇప్పుడు ఓటీటీలోనూ రచ్చ చేస్తుంది `కాటేరా`. అక్కడ కూడా తెగ చూస్తున్నారు. ఈ మూవీ ఈ శుక్రవారం(ఫిబ్రవరి 9) నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో దీన్ని ప్రసారం చేస్తున్నారు. అక్కడ కూడా సినిమాకి మంచి వ్యూస్‌ లభిస్తుంది. రికార్డు వ్యూస్‌ నమోదు అవుతున్నారు. చాలా కాలం తర్వాత దర్శన్‌ సినిమా పెద్ద హిట్‌ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాకి వ్యూస్‌ మినిట్స్ భారీగా నమోదు కావడం విశేషం. 
 

45

`కాటేరా` గ్రామీణ నేపథ్యంలో సాగే మూవీ. వ్యవసాయం ప్రాధాన్యతని, వ్యవసాయ బిల్లుకి సంబంధించిన అంశాలను చర్చిస్తూ తెరకెక్కింది. పీరియాడికల్‌ మూవీగా రూపొందించారు దర్శకుడు తరుణ్‌ సుధీర్‌. ఇందులో దర్శన్‌కి జోడీగా సీనియర్‌ హీరోయిన్‌ మాలా శ్రీ కూతురు ఆరాధన రామ్‌ హీరోయిన్‌గా నటించింది. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో జగపతిబాబు విలన్‌గా నటించడం విశేషం. రాక్‌ లైన్‌ వెంకటేష్‌ నిర్మించారు. 
 

55

`కాటేరా` మూవీ చాలా పోటీ మధ్య విడుదలైంది. ఓ వైపు `సలార్‌`, మరోవైపు హిందీ మూవీ `డంకీ` ఉంది. `సలార్‌` డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కన్నడ దర్శకుడే కావడం విశేషం. కానీ `కాటేరా` ముందు `సలార్‌` బ్యాక్‌ కావాల్సి వచ్చింది. ఆల్‌రెడీ చూసేసిన మూవీ కావడంతో కన్నడ ఆడియెన్స్ ఈ మూవీ కంటే `కాటేరా`కే ప్రయారిటీ ఇచ్చారు. పైగా స్థానికతతో రావడంతో ఆడియెన్స్ ఎంకరేజ్‌ చేశారు. సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories