Jr NTR: నాకు పట్టిన శని వదిలింది అప్పుడే.. తన లైఫ్ పై, ముగ్గురు హీరోయిన్లపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

Published : Apr 24, 2026, 01:37 PM IST

ఎన్టీఆర్ తన జీవితంలో శని ఎప్పుడు వదిలిందో వివరించారు. ఈ క్రమంలో ముగ్గురు హీరోయిన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ చేసిన కామెంట్స్ విని సీనియర్ నటి షాక్ అయ్యారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. తారక్ చివరగా నటించిన వార్ 2 చిత్రం నిరాశ పరిచింది. ఎన్టీఆర్ బరువుతో సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాఖీ మూవీ టైంలో తారక్ లుక్స్ పై విమర్శలు వచ్చాయి.

25
యమదొంగ చిత్రం కోసం

దీనితో ఎన్టీఆర్ యమదొంగ చిత్రం కోసం బాగా బరువు తగ్గారు. బరువు తగ్గడంతో తారక్ సన్నగా, స్టైలిష్ గా మారారు. అందుకే యమదొంగ మూవీలో తారక్ లుక్స్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. సన్నగా కావడం వల్ల నీ లైఫ్ లో ఏమైనా కోల్పోయావా అని రమ్యకృష్ణ ఎన్టీఆర్ ని ప్రశ్నించారు.

35
దరిద్రం పోయింది

దీనికి తారక్ బదులిస్తూ..సన్నబడ్డాక బరువుతో పాటు, నాకున్న శని కూడా వదిలిపోయింది అని తెలిపారు. దరిద్రం పోయింది. బరువు తగ్గడం ఎంత కష్టమో, మనకున్న దరిద్రాన్ని కూడా పోగొట్టుకోవడం అంత కష్టం జీవితంలో అని తారక్ అన్నారు.

45
ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

అదే ఇంటర్వ్యూలో హీరోయిన్ల గురించి కూడా ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్లలో వాగుడుకాయ అంటే ఎవరు అని అడగగా తారక్ ఛార్మి అని బదులిచ్చారు. ఛార్మి నోటికి తాళం ఉండదు. వాగుతూనే ఉంటుంది అని అన్నారు.

55
శ్రీదేవి

హాట్ గా ఉండే హీరోయిన్లు ఎవరు అని ప్రశ్నించగా తారక్ బదులిస్తూ రమ్యకృష్ణకి షాకిచ్చారు. ఇంకెవరు రమ్యకృష్ణ, శ్రీదేవి అని తారక్ సమాధానం ఇచ్చారు. దీనితో రమ్యకృష్ణ స్పందిస్తూ.. నన్ను ఇంకొక ప్రశ్న అడగకుండా చేశావు అని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories