Jr Ntr: సినిమా ఫ్లాప్‌ అయితే ఎన్టీఆర్‌ పరిస్థితి ఇదే.. ఆ భయం ఇప్పటికీ వెంటాడుతుందా?

Published : Nov 11, 2026, 07:24 PM IST

ఎన్టీఆర్‌ సక్సెస్‌ ఫెయిల్యూర్‌ గురించి రియాక్ట్ అయ్యారు. సక్సెస్‌ అయినా, ఫెయిల్యూర్‌ అయినా తనకు ఒక్క రోజు మాత్రమే అని తెలిపారు. అంతకు మించి అది తనని ప్రభావితం చేయదని వెల్లడించారు.

PREV
13
డ్రాగన్‌తో రాబోతున్న ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. సక్సెస్‌ రేట్‌ చాలా తక్కువే. కానీ ఒక్క హిట్‌తో మరో స్థాయికి వెళ్లిపోతున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆయన పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తూ రాణిస్తున్నారు. అందులో భాగంగా `డ్రాగన్‌` చిత్రంలో నటించారు. ఇది వచ్చే ఏడాది రాబోతుంది. చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. యంగ్‌ హీరో అనీష్‌ నటించిన `ఇట్లు అర్జున్‌` సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా తన ఫెయిల్యూర్‌ గురించి ఓపెన్‌ అయ్యారు.

23
సినిమా ఫెయిల్యూర్‌ అయితే ఎన్టీఆర్‌ ఏం చేస్తాడంటే?

తన ఫెయిల్యూర్‌ గురించి చెబుతూ, పరాజయాలు వచ్చినప్పుడు బాధపడతాను, కాకపోతే ఆ ప్రభావం ఒక్క రోజే ఉంటుంది, అంతకు మించి బాధపడతాను. ఆ తర్వాత రోజు నుంచి నార్మల్‌ అయిపోతాను, పనిలోకి వెళ్లిపోతాను, ఎక్కువగా ఆలోచించను అని తెలిపారు ఎన్టీఆర్‌. సక్సెస్‌ ఫెయిల్యూర్స్ తనని పెద్దగా ఎఫెక్ట్ చేయవని తెలిపారు. సక్సెస్‌ ల విషయంలోనూ తాను అంతే అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ సందర్బంగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మొదటి సినిమా అనుభవాన్ని తాను మర్చిపోలేను అన్నారు. ఆ మూవీ వస్తుందంటే, టెన్షన్‌గా ఉంటుందని, ఇప్పటికీ నర్వస్‌గా ఫీలవుతానని వెల్లడించారు. ఇప్పటికీ తెలియని టెన్షన్‌ ఉంటుందని చెప్పారు.

33
వరుస లైనప్‌లో ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ `నిన్ను చూడాలని` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. `స్టూడెంట్ నెం 1` సినిమాతో హిట్‌ అందుకున్నారు. అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక `సింహాద్రి`తో బిగ్‌ బ్రేక్‌ని అందుకున్నారు. ఆ తర్వాత `యమదొంగ`, `అదుర్స్`, `బృందావనం`, `టెంపర్‌`, `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజ్‌`, `జై లవకుశ`, `అరవింద సమేత`, ఆర్‌ఆర్‌ఆర్‌`, `దేవర` చిత్రాలతో విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కాబోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌తో `ది గాడ్‌ ఆఫ్‌ వార్‌`, అలాగే నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తో సినిమా చేయనున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories