సౌత్ లో కంటే పుష్ప నార్త్ లో భారీ విజయం అందుకుంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలైన పుష్ప హిందీ వెర్షన్, మెల్లగా మౌత్ టాక్ తో పుంజుకుని రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ తర్వాత హిందీలో భారీ విజయం నమోదు చేసిన హీరో అల్లు అర్జున్ అనడంలో సందేహం లేదు. పుష్పలో నటనకు అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల కానుంది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల వసూల్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.