Balakrishna: బాలయ్య జాతకంలో అతి పెద్ద గండం, ఆదివారం ఆయన అస్సలు చేయకూడని పని ఏదో తెలుసా?

Published : May 21, 2026, 11:41 AM IST

ప్రస్తుతం బాలకృష్ణ టైమ్ నడుస్తోంది. ఆయన పట్టిందల్లా బంగారమౌతోంది. అటు పొలిటికల్ గా.. ఇటు సినిమా పరంగా వరుస విజయాలు ఆయన్ను వరిస్తున్నాయి. అయితే బాలయ్య జాతకంలో ఉన్న గండం ఏంటో తెలుసా?

PREV
15
దూసుకుపోతున్న బాలకృష్ణ..

సినిమాలు, రాజకీయాల్లో తిరుగులేని విజయాలతో బాలకృష్ణ దూసుకుపోతున్నాడు. హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన బాలయ్య.. వరుసగా 5 సినిమాలు హిట్ కొట్టి.. హీరోగా సంచలన విజయం నమోదు చేశాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్న ఆయన.. మరో సినిమా విజయంతో డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ సూపర్ పాస్ట్ గా జరుగుతోంది.

25
జాతకాలపై నమ్మకం ఎక్కువ..

బాలకృష్ణకు జాతకాలపై నమ్మకం ఎక్కువ. ఆయన ఏ పని చేసినా ముహూర్తం చూసి చేసుకుంటుంటారు. చేతికి రకరకాల తాళ్ళు, మొడలో మాలలు, నుదుటిన బొట్టు లేకుండా బాలయ్య బయటకు రాడు. అంతే కాదు ఉదయం మూడు గంటలకే లేచి గంటల తరబడి పూజ చేయడం ఆయనకు బాగా అలవాటు. ఆయన సినిమాల ఓపెనింగ్ దగ్గర నుంచి పేకప్ చెప్పి, గుమ్మడికాయ కొట్టేవరకూ.. ప్రతీది పద్దతి ప్రకారం, మహూర్త బలంలో చేయాల్సిందే. తన పర్సనల్ విషయాలలో కూడా బాలయ్య ఈ నియమాన్ని బాగా పాటిస్తుంటారు.

35
జాతకాలకు విరుద్దంగా ఏ పనిచేయడు..

బాలయ్య జాతకాలకు వ్యతిరేకంగా ఏ పని చేయడు. తన నక్షత్రం రాశుల ను బట్టి... డ్రెస్పింగ్ స్టైల్ ను మెయింటేన్ చేస్తుంటారు. ప్రాణంమీదకు వచ్చినా.. తన నియమాలను మాత్రం వదిలిపెట్టడు బాలయ్య బాబు. ఒక సారి జాతకానికి విరుద్దంగా చేసినందుకే ఆయన ఒక ప్రమాదాన్ని ఎదుర్కొవలసి వచ్చింది. ఆ విషయాన్ని బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ ప్రమాదం ఏంటి? జాతకంలో ఏ గండం వల్ల బాలకృష్ణకు ప్రమాదం జరిగిందో తెలుసా?

45
బాలయ్యకు తప్పిన పెద్దగండం..

బాలకృష్ణది మూలా నక్షత్రం. ఆయన జాతకం ప్రకారం నలుపు అస్సలు ముట్టుకోకూడదు. బ్లాక్ డ్రెస్ కూడా వేసుకోకూడదు. మరీ ముఖ్యంగా ఆదివారం బాలకృష్ణ నలుపు వేసుకుంటే ఏదో ఒక ప్రమాదం జరుగుతందట. అందుకు తగ్గట్టే ఆయన తనకెరీర్ లో బ్లాక్ డ్రెస్ లు వేసుకోవడం మానేశారు.

 కానీ ఓసారి మాత్రం తప్పక నలుపు డ్రెస్ వేసుకుని షూటింగ్ కి వెళ్లారు. ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లో.. నలుపు చొక్కా వేసుకుని షూటింగ్ కు వెళ్లారు బాలయ్య. ఆ షూటింగ్ లో జారిపడి నడుముకు దెబ్బ తగిలింది. అప్పటికీ ఆయన అనుకుంటూనే ఉన్నారట.. ఈ రోజు నల్ల చొక్కా వేసుకున్నాను ఏమౌతుందో ఏమో అని.

55
భయంతో షూటింగ్ నుంచి వెల్లిపోయిన ఎస్ పి బాలు..

ఇక్కడ మరో విషయం మాట్లాడుకోవాలి.. ఆదిత్య 369 సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు స్టార్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ సినిమా షూటింగ్ జరిగినన్నాళ్లు ఆయన అసలు సెట్ కు రాలేదు. కానీ ఎందుకో ఆదివారం రోజున.. సరదాగా సెట్స్ కు వచ్చారు బాలు. సరిగ్గా అదే టైమ్ లో బాలయ్య పడిపోవడం, నడుముకు దెబ్బ తగలడంతో.. బాలు భయంతో షూటింగ్ నుంచి వెళ్లిపోయారట. నేను రావడం వల్లే ఇలా జరిగింది.. ఇక మీదట సెట్ కు నేను రాను అని చెప్పేశారట. ఈ విషయాన్ని ఓ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో బాలయ్య బాబు స్వయంగా వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories