ఈ చిత్రాన్ని మ్యాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ కలిసి నిర్మిస్తున్నాయి. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో సెప్టెంబర్ 19, 2023న సినిమా ప్రకటన వీడియోను విడుదల చేశారు. “ఈ కథ విన్నప్పుడే నా మనసును తాకింది. ఒక బయోపిక్ తీయడం సులభం కాదు. అది కూడా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గురించిన కథ అయితే మరింత కష్టమే. కానీ మా బృందం సన్నద్ధంగా ఉంది,” అని రాజమౌళి పేర్కొన్నారు.