కాస్ట్లీ గిఫ్ట్ తో ప్రియుడు రాకింగ్‌ రాకేష్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన జోర్దార్‌ సుజాత.. జబర్దస్త్ కమేడియన్‌ ఎమోషనల్

Published : May 03, 2022, 05:47 PM ISTUpdated : May 03, 2022, 06:15 PM IST

`జబర్దస్త్` షోలో క్రేజీ లవ్‌ జోడీగా పేరుతెచ్చుకుంది జోర్దార్‌ సుజాత, రాకింగ్‌ రాకేష్‌ జంట. ఓపెన్‌గా తమ ప్రేమ విషయాలను పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ప్రియుడి రాకేష్‌కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చింది సుజాత. సర్‌ప్రైజ్‌ చేసింది. 

PREV
16
కాస్ట్లీ గిఫ్ట్ తో ప్రియుడు రాకింగ్‌ రాకేష్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన జోర్దార్‌ సుజాత.. జబర్దస్త్ కమేడియన్‌ ఎమోషనల్

`జబర్దస్త్`(Jabardasth)లో రష్మి-సుధీర్‌, వర్ష-ఇమ్మాన్యుయెల్‌తోపాటు మరో కొత్త జంట రెడీ అయ్యింది. `జోర్దార్‌` సుజాత-రాకింగ్‌ రాకేష్‌(Jordar Sujatha-Rocking Rakesh) సైతం ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరిద్దరు నిర్మొహమాటంగా ప్రేమించుకుంటున్నారు.  చాలా సందర్భాల్లో `జబర్దస్త్` వేదికపైనే తమ ప్రేమ విషయాన్నివెల్లడించారు. లవ్‌ ప్రపోజ్‌ చేసుకున్నారు. దాగుడు మూతలు లేకుండా స్ట్రెయిట్‌ ఫర్వార్డ్ గా ఉందీ జంట. 

26

ఇద్దరు కలిసి స్కిట్లలో నవ్వులు పూయిస్తూనే తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో రాకేష్‌(Rakesh)కి ఓ విలువలైన గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది సుజాత(Sujatha). లక్ష రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్‌ కోనిచ్చింది. దీంతో ఎమోషనల్‌ అయ్యారు రాకేష్‌. తాను జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు రాకేష్‌. ఈ విషయాన్ని సుజాత తన యూట్యూబ్‌ ఛానెల్‌ `సూపర్‌సుజాత` లో వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోని పంచుకుంది. 

36

తన ఆత్మీయుడు, స్నేహితుడు, అంతకు మించిన అయిన రాకేష్‌కి తాను ఫోన్‌ కోనిస్తున్నట్టు చెప్పింది. అయితే ఆయనకు తెలియకుండా సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్టు ముందుగా చెప్పింది. హైదరాబాద్‌లోని అమీర్‌ పేటలో గల ఓ షోరూమ్‌కి తీసుకెళ్లింది. అయితే తానే ఫోన్‌ కొంటున్నట్టు కలరింగ్‌ ఇచ్చింది సుజాత. రాకేష్‌ కూడా అలానే ఫీలయ్యాడు. ఆ ఫోన్‌ ఫీచర్స్ అన్ని వెల్లడించారు. అంతా అయిపోయాక సడెన్‌గా ఈ ఫోన్‌ నీకే అంటూ రాకేష్‌ కి ఇచ్చింది సుజాత. 

46

సుజాత ఫోన్‌ గిఫ్ట్ గా ఇవ్వడాన్ని మొదట రాకేష్‌ నమ్మలేదు. జోక్‌ చేస్తుందని భావించాడు. కానీ ఆమె సీరియస్‌గానే ఇస్తున్నట్టు చెప్పడంలో రాకేష్‌ నోట మాట రాలేదు. అలా చూస్తూ ఉండిపోయాడు. షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇంతటి కాస్ట్లీ ఫోన్‌ తనకు గిఫ్ట్ గా ఇవ్వడంతో తాను ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పాడు. లక్షా 20 వేల రూపాయల ఫోన్‌ ఇదని, తాను కొనాలంటే చాలా టైమ్‌ పడుతుందని, సుజాత కొంటుంటేనే వద్దు అని చెప్పినట్టు తెలిపారు రాకేష్‌. అయితే ఇలానే తనకు బెంజ్‌ కారు కొనిచ్చే స్థాయికి ఆమె ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్‌ అయ్యాడు. 

56

రాకేష్‌కి గిఫ్ట్ ఇవ్వడంపై సుజాత స్పందిస్తూ, తను కొద్దిరోజుల నుంచి మొబైల్‌తో ఇబ్బందిపడుతున్నాడు. పైగా కోపం వస్తే ఫోన్‌ పగలగొట్టే అలవాటు ఉంది. నేను అతడి మనసుకు దగ్గరైన వ్యక్తిని కాబట్టి నేను ఫోన్‌ కొనిస్తే దాన్ని పగలగొట్టడానికి ఆలోచిస్తాడనిపించింది. తను నాకు దగ్గరైనప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాను, నా ప్రతీ విజయంలో రాకేశ్‌ ఉన్నాడు. నేను ఫోన్‌ గిఫ్టిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడనిపించింది, అందుకే ఈ ఫోన్‌ బహుమతిగా ఇస్తున్నా' అని చెప్పుకొచ్చింది.  సామ్‌సంగ్‌ గెలాక్సీ S 22 అల్ట్రా ఫోన్‌తో పాటు స్మార్ట్‌ వాచ్‌ ని గిఫ్ట్ గా ఇచ్చింది సుజాత. మరి వీరి ప్రేమ ఏ పెళ్లి వరకు వెళ్తుందా? అనేది చూడాలి. 

66

ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్‌లో `జోర్దార్‌` న్యూస్‌ రీడర్‌గా పాపులర్‌ అయ్యింది సుజాత. ఆ పాపులారిటీతో ఆమెకి `బిగ్‌బాస్‌ 4` షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. అందులో కొన్ని వారాలపాటు అలరించింది. అయితే ఫేమ్‌ నవ్వు అనే ముద్ర వేసుకుని మధ్యలోనే బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. ఆ తర్వాత అడపాదడపా టీవీ షోస్‌లో మెరుస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు `జబర్దస్త్`లో సెటిల్‌ అయ్యింది. రాకేష్‌ టీమ్‌లో ఆయనకు జోడీగా చేస్తూ నవ్వులు పూయిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories