ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మీకు న్యాయం చేస్తాను అంటూ మాధురీ తల్లితండ్రులకు సపోర్ట్ చేస్తుంది. తర్వాత సీన్ లో జ్ఞానాంబా గోవిందరాజులు జానకి కోసం ఇంట్లో వెతుకుతుంటారు. అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. అది చుసిన మల్లిక తన కోసమే వచ్చారు అని అనుకోని కంగారు పడుతుంది.. మరోవైపు ఇంట్లో వారందరు పోలీసులను చూసి షాక్ అవుతారు. ఎందుకు వచ్చారు అని అడిగితే మీ ఇంట్లో ఒక వ్యక్తిపైనా కంప్లైంట్ ఫైల్ అయ్యింది.. అరెస్ట్ చేసి తీసుకెళ్లాలి అని వచ్చాము అంటే అందరూ షాక్ అవుతారు.