ఈ ఎపిసోడ్లు తరుణ్, అఖిల్ కి ఫోన్ చేసి మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు మా కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాము. 25వేలు శాలరీ ఉంటుంది వారం రోజుల్లో వచ్చే జాయిన్ అవ్వాలి అనడంతో అఖిల్ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత అఖిల్ ఆ సంతోషాన్ని జ్ఞానాంబ వాళ్ళతో పంచుకోవడానికి అక్కడికి వెళ్లి అమ్మానాన్న నాకు జాబ్ వచ్చింది అనడంతో వాళ్లు కూడా సంతోష పడుతూ ఉంటారు. ఎంతమంచి శుభవార్త చెప్పావు అని అంటుండగా ఇంతలోనే అక్కడికి మల్లిక విష్ణు వస్తారు. శాలరీ అంటున్నావు ఏంటి అఖిల్ అనే మల్లిక అడగగా నాకు జాబు వచ్చింది వదిన అనడంతో సంతోషపడుతూ ఉంటారు.