Jennifer Lopez:20 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్, ఇప్పుడు వివాహం.. ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లాడిన జెన్నిఫర్ లోపేజ్

Published : Jul 18, 2022, 10:38 AM IST

జెన్నిఫర్ లోపేజ్.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న పాప్ సింగర్ ఆమె. సింగర్ గా, నటిగా దశాబ్దాల కాలంగా జెన్నిఫర్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తూ వస్తోంది.

PREV
16
Jennifer Lopez:20 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్, ఇప్పుడు వివాహం.. ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లాడిన జెన్నిఫర్ లోపేజ్

జెన్నిఫర్ లోపేజ్.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న పాప్ సింగర్ ఆమె. సింగర్ గా, నటిగా దశాబ్దాల కాలంగా జెన్నిఫర్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తూ వస్తోంది. ఇక ఆమె గ్లామర్ చూస్తే కుర్రాళ్లకి కంటి మీద కునుకు ఉండదు. 52 ఏళ్ల వయసులో కూడా మతి పోగొట్టే అందాలతో సెన్సేషన్ గా నిలుస్తోంది ఈ వరల్డ్ ఫేమస్ బ్యూటీ. 

26

తాజాగా జెన్నిఫర్ లోపేజ్ తన లైఫ్ లో మరో కీలక అడుగు వేసింది. 52 ఏళ్ల వయసులో ఈ హాట్ బ్యూటీ నాలుగో వివాహం చేసుకుంది. తన లాంగ్ టైం ప్రియుడు ప్రముఖ హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ ని లాస్ వేగాస్ లో వివాహం చేసుకుంది. జెన్నిఫర్ కి ఇది నాలుగో వివాహం కాగా బెన్ కి ఇది రెండవ పెళ్లి. 

36

బెన్, జెన్నిఫర్ ల వివాహం, లవ్ అఫైర్ చాలా విచిత్రమైనవే. 2002 నుంచే వీరిద్దరి రియల్ లైఫ్ రొమాన్స్ షురూ అయింది. అదే ఏడాది ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ విభేదాల కారణంగా పెళ్ళికి ముందే విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు వ్యక్తులని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. 

46

జెన్నిఫర్ లోఫెజ్ తన మూడవ భర్త నుంచి 2014లో విడిపోయింది. ఇక బెన్ తన భార్య నుంచి 2018లో విడాకులు పొందాడు. దీనితో వీరిద్దరి మధ్య మళ్ళి ప్రేమ చిగురించింది. దీనితో పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలకాలని డిసైడ్ అయ్యారు. తమ రిలేషన్ ని వీలైనంత ప్రైవేట్ గా ఉంచే ప్రయత్నం చేశారు. ఈ  ఏడాది ఏప్రిల్ లో మరోసారి వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. నిశ్చితార్థంలో జెన్నిఫర్ కుమార్తె కూడా పాల్గొందట. 

56

కానీ ఇప్పుడు సడెన్ గా వివాహం చేసుకుని ఈ జంట అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. జెన్నిఫర్ లోపేజ్ పర్సనల్ హెయిర్ స్టైలిష్ క్రిస్ అప్లాంటన్ ఆమె మ్యారేజ్ విషయాన్ని కంఫర్మ్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. ఈ వీడియోలో జెన్నిఫర్ మ్యారేజ్ కోసం వైట్ గౌన్ లో రెడీ అవుతోంది. చాలా అమేజింగ్ గా అనిపిస్తోంది. పెళ్లి కోసం ఎప్పటి నుంచో దాచుకున్న గౌను ఇది అని జెన్నిఫర్ ఈ వీడియోలో చెబుతోంది. 

66

ఇక జెన్నిఫర్, బెన్ ల వివాహం లీగల్ గా కూడా పూర్తయిందట. కోర్టు నుంచి వీరిద్దరూ మ్యారేజ్ సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తోంది. వివాహాం తర్వాత తన భర్త పేరు వచ్చేలా జెన్నిఫర్ లోపేజ్ తన పేరుని జెన్నిఫర్ లిన్ అఫ్లెక్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. 

click me!

Recommended Stories