Jayasudha-Jayaprada: జయప్రద అంటే జయసుధకి ఎందుకంత కోపం.. మొహం మీదే కారణం చెప్పిన సహజనటి

Published : Oct 25, 2026, 02:41 PM IST

జయప్రద, జయసుధ ఒకే సమయంలో హీరోయిన్లుగా నటించారు. స్టార్స్ గా ఎదిగారు. కానీ జయప్రద అంటే మాత్రం జయసుధకి చాలా కోపం అట. జెలసీ ఫీలింగ్‌ ఉంటుందట. ఆ విషయాన్ని సహజనటినే ఓపెన్‌గా చెప్పారు.

PREV
13
టాలీవుడ్‌ ని శాసించిన జయసుధ, జయప్రద

జయప్రద, జయసుధ ఒకప్పుడు టాలీవుడ్‌ని శాసించిన నటీమణులు. సావిత్రి, జమునల తర్వాత ఇండస్ట్రీకి వచ్చి తామేంటో నిరూపించుకున్నారు. తెలుగులోనే కాదు జయసుధ సౌత్‌లో ఊపేస్తే, జయప్రద నార్త్ లో ఊపేసింది. ఇద్దరూ రాజకీయాల్లో రాణించారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. మొత్తంగా ఇద్దరూ తిరుగులేని స్టార్ హీరోయిన్లుగా రాణించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాకపోతే చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే జయప్రద గురించి జయసుధ చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. జయప్రద అంటే సహజనటికి కోపం, జెలసీ అట. ఎందుకో కూడా ఓపెన్‌గానే చెప్పేసింది.

23
జయప్రద అంటే జయసుధకి జెలసీ ఎందుకంటే

జయప్రద హోస్ట్ గా జయప్రదం అనే టాక్‌ షో నిర్వహించారు. ఇందులో జయసుధ పాల్గొన్నారు. ఈ క్రమంలో తన పేరు విషయంలో ఎప్పుడైనా జెలసీగా ఫీలయ్యారా? అంటే తనకు కోపంగా ఉంటుందని చెప్పింది జయసుధ. ఈవెంట్లలో ఎక్కువగా జయప్రద పేరునే వాడుతుంటారు. జయప్రదంగా ఉంటుందని, జయప్రదంగా జరుగుతుందని చెబుతుంటారు, అంతేకాదు ఒక మినిస్టర్‌ కూడా ఆ మధ్య జయప్రదగారు ఇక్కడ స్టేజ్‌ మీద కూర్చొని ఉన్నా అని నా పేరు మర్చిపోయి జయప్రద పేరుని సంభోదించారు. ఇవన్నీ విన్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. అవి విన్నప్పుడు అన్ని పార్టీల్లో నువ్వు(జయప్రద) ఉంటే బాగుంటుందనుకుంటాను. ఇలాంటి సందర్భాల్లో తనకు జెలసీగా ఉంటుంద`ని చెప్పింది జయసుధ.

33
నటీమణులుగా పోటీ పడ్డ జయసుధ, జయప్రద

ఇకపై అయినా జయప్రద అనేది తీసేసి జయసుధంగా జరగాలి అని పిలిస్తే బాగుంటుందని తెలిపింది. అయితే జయసుధ, జయప్రద మధ్య చాలా సరదాగా ఈ కన్వర్జేషన్‌ జరిగింది. తాజాగా ఈ పాత వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే అప్పట్లో ఇద్దరి మధ్య గట్టి పోటీ కూడా ఉండేది. ఇద్దరు పేర్ల విషయంలోనే కాదు, పాత్రల విషయంలో సినిమాల విషయంలోనూ పోటీ ఉండేది. హీరోలు కూడా ఈ ఇద్దరి విషయంలో పోటీ పడేవారట. అలా ఇద్దరూ పోటాపోటీగా నటించారు, సినిమాలు చేసి మెప్పించారు. ఇద్దరు గ్లామర్‌ పాత్రలు చేశారు. కాకపోతే జయప్రద ఎక్కువగా గ్లామర్‌కి ప్రయారిటీ ఇచ్చారు. జయసుధ మాత్రం ట్రెడిషనల్‌ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సహజమైన నటనతో మెప్పించారు. అందుకే ఆమెని సహజనటి అంటారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories