హీరో విశాల్ గురించి పరిచయం అవసరం లేదు. విశాల్ ని ఫ్యాన్స్ తెలుగు హీరోగానే భావిస్తారు. అంతలా టాలీవుడ్ తో విశాల్ కి కనెక్షన్ ఉంది. విశాల్ నటించిన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతుంది. పందెం కోడి నుంచి విశాల్ కి తెలుగులో క్రేజ్ మొదలైంది. విశాల్ హెల్త్ పరంగా డల్ గా ఉండడం ఫ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు.
Vishal
కానీ రీసెంట్ గా మద గజ రాజా ఈవెంట్ లో విశాల్ వణికిపోతూ కనీసం నడవలేని స్థితిలో కనిపించాడు. విశాల్ సన్నిహితులు అతడికి వైరల్ ఫీవర్ సోకింది అని చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని, త్వరలో కోలుకుంటాడు అని తెలిపారు. ఖుష్బూ అయితే విశాల్ కి డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లు తెలిపింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇలా విశాల్ ఆరోగ్యం గురించి కోలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు.
విశాల్ గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో ఫ్యాన్స్ ఆందోళనకి గురయ్యారు. విశాల్ కి ఫీవర్ తగ్గింది అని, విశ్రాంతి అవసరం అని అపోలో వైద్యులు తెలిపారు. కానీ తాను నటించిన చిత్రం కాబట్టి ప్రోమోట్ చేయడం తన బాధ్యత అని విశాల్ ఫీల్ అయ్యాడు. అందుకే అనారోగ్యంతో ఉన్నా మద గజ రాజా ఈవెంట్ కి హాజరయ్యాడు.
Jayam Ravi
తాజాగా విశాల్ ఆరోగ్యంపై క్రేజీ హీరో జయం రవి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. విశాల్, జయం రవి ఇద్దరూ మంచి స్నేహితులు. ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యం గురించి జయం రవికి ప్రశ్న ఎదురైంది. జయం రవి బదులిస్తూ.. ప్రస్తుతం విశాల్ కి బ్యాడ్ టైం కొనసాగుతోంది. దీని నుంచి విశాల్ త్వరలోనే బయట పడతాడు. ఎందుకంటే విశాల్ ధైర్యవంతుడు.. దేన్నైనా ఎదుర్కోగలడు. సింహంలా తిరిగి వస్తాడు అని కామెంట్స్ చేశారు.
Jayam Ravi
వైరల్ ఫీవర్ వస్తే బ్యాడ్ టైం ఏంటి అనే చర్చ ఫ్యాన్స్ లో జరుగుతోంది. ప్రస్తుతం విశాల్ కి బ్యాడ్ టైం సాగుతోంది అనేంతలా ఏం జరిగింది అని అభిమానులు సందేహ పడుతున్నారు. జయం రవి విశాల్ కి స్నేహితుడు కాబట్టి అలా మాట్లాడారు అని.. విశాల్ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహితులు మరోసారి చెబుతున్నారు.