పేరు మార్చుకున్న క్రేజీ హీరో.. పర్సనల్ లైఫ్ లో ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయమా ?

First Published | Jan 14, 2025, 8:46 AM IST

నటుడు జయం రవి తన పేరును రవి మోహన్ గా మార్చుకున్నట్లు ప్రకటించారు. రవి మోహన్ స్టూడియోస్ అనే కొత్త నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అభిమానుల కోసం రవి మోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థను కూడా స్థాపించారు.

జయం రవి శుభవార్త చెప్పారు

జయం రవి తన పేరును రవి మోహన్ గా మార్చుకున్నారు. 2003 లో జయం సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయనకు ఆ సినిమా పేరుతోనే జయం రవి అనే పేరు స్థిరపడిపోయింది. 20 ఏళ్ల తర్వాత తన పేరును మార్చుకుంటున్నట్లు ప్రకటించారు.

రవి మోహన్ గా మారిన జయం రవి

రవి మోహన్ గా పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించిన జయం రవి, రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.


జయం రవి పేరు మార్పు

ఇక నుంచి తనను రవి మోహన్ అని పిలవాలని, జయం రవి అని పిలవవద్దని కోరారు.జయం రవి తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

జయం రవి ప్రకటన

పేరు కలసి రానప్పుడు హీరోలు జ్యోతిష్యం ప్రకారం మార్పులు చేసుకుంటారు. రవి మోహన్ స్టూడియోస్ ద్వారా ప్రపంచ స్థాయి సినిమాలు నిర్మించబోతున్నట్లు తెలిపారు. 

నిర్మాత అయిన జయం రవి

అభిమానులకు సహాయం చేసేందుకు రవి మోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జయం రవి ఇటీవల తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 

ఫౌండేషన్ ప్రారంభించిన జయం రవి

తన కొత్త ప్రయాణానికి అందరూ మద్దతు ఇవ్వాలని రవి మోహన్ కోరారు. ఆ మధ్యన జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పర్సనల్ లైఫ్ లో ఇబ్బందుల వల్లే జయం రవి ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. 

Latest Videos

click me!