ఎక్కువ సినిమాలు చేసిన పాపానికి తప్పుడు లింకులు పెట్టారు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్

Published : Oct 17, 2026, 11:31 AM IST

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది జయచిత్ర. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో పాటు మురళీ మోహన్, శోభన్ బాబు లాంటి హీరోలతో కూడా నటించి మెప్పించింది. అయితే జయచిత్ర సినీ కెరీర్‌లో ఎదురైన ఒక ఇబ్బందికర పరిస్థితి గురించి మీకు తెలుసా?

PREV
14
టాలీవుడ్ అందాల నటి..

తెలుగు సినిమాలో అందాల నటుడు శోభన్ బాబు అయితే.. అందాల నటి జయచిత్ర. ఎంతమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా.. జయచిత్ర అందానికి ఎక్కువ మార్కులు పడేవి. అందంతో పాటు అభినయంలో కూడా తగ్గేవారు కారు అలనాటి తార. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా ఆమెకు ఎక్కువ డిమాండ్ ఉండేది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తరువాత కూడా క్యారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకులను పలుకరించారు జయచిత్ర. ఎక్కువగా నెగెటివ్ రోల్స్‌లో కనిపించి సందడి చేశారు. 'అబ్బాయిగారు', 'సమరసింహారెడ్డి' లాంటి సినిమాల్లో ఆమె నటన అద్భుతమని చెప్పాలి.

24
సినిమాలకు గుడ్ బై చెప్పిన నటి..

ప్రస్తుతం సినిమాలు మానేసి ఇంటికే పరిమితమయ్యారు జయచిత్ర. అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో కనిపిస్తూ.. అప్పటి విశేషాలను షేర్ చేసుకుంటుంటారు. ఆమధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన తోటి నటుడు మురళీ మోహన్‌తో తనకున్న అనుబంధం, ఆ కాలంలో వచ్చిన తప్పుడు ప్రచారాలు, షూటింగ్‌లలో తాను ఎదుర్కొన్న ఆసక్తికర అనుభవాల గురించి చాలా విషయాలను ఆమె వెల్లడించారు. స్టార్ యాక్టర్ మురళీ మోహన్ వయస్సు గురించి జయచిత్ర మాట్లాడుతూ — "ఈమధ్య ఒక ఫంక్షన్‌లో మురళీ మోహన్ గారిని కలిశాను. ఆయనకి 83 ఏళ్లు అని తెలిసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మేము ఆ రోజుల్లో కలిసి నటించినప్పుడు ఆయన వయస్సు ఎంత అనేది అసలు తెలిసేదే కాదు. ఎంతో క్రమశిక్షణతో, హెల్దీగా తన బాడీని, లుక్స్‌ను మెయింటైన్ చేయడం ఆయనకే చెల్లింది" అని ప్రశంసించారు.

34
తప్పుడు రాతలు రాశారు..

మురళీ మోహన్‌తో తన స్నేహం, సినిమాలో తమ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉండడంతో, అప్పట్లో ఒక పత్రిక తమరి మధ్య లేనిపోని లింకప్‌లు పెట్టి రాసిందని జయచిత్ర గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. "మేమిద్దరం కలిసి ఎక్కువ హిట్ సినిమాలు చేయడం చూసి అసూయతో కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాశాయి. దాంతో నేను తీవ్ర అసంతృప్తికి గురయ్యాను. ఆ పత్రిక యజమానిని కలిసి 'నీ ఇంట్లో చెల్లెలు, కూతురి గురించి ఇలాగే రాస్తావా?' అని నిలదీశాను. డిఫమేషన్ (కోర్టు కేస్) వేయడానికి సిద్ధపడడంతో, ఎన్.సి. రాఘవాచారి గారు జోక్యం చేసుకున్నారు. చివరికి ఆ పత్రిక నిర్వాహకులు వచ్చి కాళ్లపై పడి క్షమాపణలు కోరడంతో విడిచిపెట్టాను" అని జయచిత్ర స్పష్టం చేశారు.

44
కృష్ణంరాజు, దాసరి కోసం రోమ్‌లో 'ప్లాట్‌ఫామ్ హీల్స్'

ఇండస్ట్రీలో తనకు చాలామంది హీరోలు మంచి మిత్రులు అని చెప్పిన జయచిత్ర.. తెలుగులో రెబల్ స్టార్ కృష్ణంరాజుతో నటించాలంటే కాస్త ఇబ్బంది అనిపించేది అన్నారు. పొడగాటి హీరోలతో నటించేటప్పుడు మ్యాచ్ అవ్వడానికి తాను పడిన కష్టాన్ని ఆమె సరదాగా పంచుకున్నారు. "నేను యూరప్ (రోమ్) వెళ్లినప్పుడు చాలా తేలికగా ఉండే ప్లాట్‌ఫామ్ హీల్స్ (Platform Heels) చెప్పులు కొన్నాను. అప్పటికి అలాంటి ప్లాట్‌ఫామ్ హీల్స్ ఇండియాకి రాలేదు. కృష్ణంరాజు గారి షూటింగ్‌లకు ఇవి బాగా ఉపయోగపడతాయని బుట్టలో వేసుకొని తీసుకెళ్లేదాన్ని. దాసరి గారికి, కృష్ణంరాజు గారికి 'మీ పేరిట ఉన్న చెప్పులివి' అని సరదాగా చెప్పేదాన్ని. ఆ హీల్స్ వేసుకునే డ్యాన్సులు కూడా చేసేదాన్ని" అని జయచిత్ర ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories