రష్మిక మందన్న క్రేజ్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా మామూలుగా లేదు. వెళ్లక వెళ్లక సినిమా ఈవెంట్ కోసం జపాన్ వెళ్తే.. అక్కడ ఆమెకు గట్టి షాక్ తగిలింది.
స్టార్ హీరోయిన్ గా దూకుడు చూపిస్తోంది హీరోయిన్ రష్మిక మందన్న. టాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించి.. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోతోంది బ్యూటీ. చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు.. ఇమేజ్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో ఆమె నటించిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
26
సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన నటించింది రష్మిక. ఈసినిమాపై రకరకాల ట్రోల్స్ వచ్చినా కాని.. బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతే కాదు దాదాపుగా 900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది యానిమల్. ఇండియాన్ బాక్సాఫీస్ ను శేక్ చేసింది.
36
ఇక ప్రస్తుతం పుష్ప2 లో నటిస్తోంది రష్మిక. అంతకు ముందు పుష్ప సినిమా ద్వారా రష్మికకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. శ్రీవల్లి పాత్రలో రష్మికను చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చాయి. ఇక శ్రీవల్లి పాత్ర మన ఇండియాన్స్ కే కాదు.. ఫారెన్ కంట్రీస్ లో కూడా బాగా పాపులర్ అయ్యింది. ఆమెకు భారీగా ఫ్యాన్స్ తయారయ్యారు ఈసినిమాతో.
46
తాజాగా రష్మిక క్రేజ్ విదేశాల్లో ఎంత ఉందో నిరూపితం అయ్యింది. ఆమెకుజపాన్ లో షాక్ తగిలినంత పని అయ్యింది. టోక్యోలో జరగనున్న క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్‌కు హాజరయ్యేందుకు రష్మిక మంధాన నిన్న ముంబై విమానాశ్రయం నుండి టోక్యోకు బయలుదేరింది. టోక్యోలో అడుగుపెట్టిన రష్మికకు... జపాన్‌కు చెందిన ఆమె అభిమానులు పుష్ప శ్రీవల్లి ఫోటోతో స్వాగతం పలికి తమ ప్రేమను కురిపించారు.
56
దాంతో రష్మిక ఈ పరిణామాన్ని ఊహించలేకపోయింది. ఆమె క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు మరో రికార్డ్ ను కూడా రష్మిక సాధించింది. క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్‌కు హాజరైన భారతదేశం నుండి మొదటి సెలబ్రిటీ రష్మిక కావడం విశేషం.
66
ఇక ప్రస్తుతం తెలుగులో పుష్ప2 తో పాటు.. తమిళంలో రెయిన్‌బో, హిందీలో రెండు కొత్త సినిమాలు, తెలుగులో ధనుష్‌తో 51వ సినిమా అంటూ నాన్‌స్టాప్‌గా నటిస్తున్న రష్మిక... అవార్డు వేడుకలు, రకరకాల ఫోటో షూట్‌లకు కూడా రెగ్యులర్‌గా హాజరవుతోంది.