జబర్దస్త్ సక్సెస్ లో యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయలకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. వీరిద్దరూ ట్రెండ్ సెట్టర్స్. 2013లో జబర్దస్త్ కామెడీ షో ప్రయోగాత్మకంగా మొదలైంది. రోజా, నాగబాబు జడ్జెస్ గా, అనసూయ యాంకర్ గా కొందరు వెండితెర కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా షో ప్రారంభించారు.
27
Rashmi Gautam and Aanasuya
జబర్దస్త్ యాంకర్ గా అనసూయ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసింది. స్కిన్ షోకి తెరలేపింది. పొట్టిబట్టల్లో గ్లామరస్ గా కనిపించేది. గతంలో ఏ తెలుగు యాంకర్ అలా ఎక్స్ పోజింగ్ చేసింది లేదు. ఈ క్రమంలో విమర్శలు తలెత్తాయి. అదే విధంగా ఆమెకు భారీ పాపులారిటీ దక్కింది.
37
వ్యక్తిగత కారణాలతో అనసూయ తప్పుకోగా రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. అనసూయను రష్మీని ఫాలో అయ్యింది. ఆమె కూడా పొట్టి బట్టలు ధరించి ఆడియన్స్ ని ఉత్తేజపరిచింది. అనసూయ రీ ఎంట్రీ ఇవ్వగా, రష్మితో ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అనసూయ తప్పుకోగా రష్మీ గౌతమ్ కొనసాగుతుంది.
47
ఏళ్ల తరబడి జబర్దస్త్ లో కమెడియన్ గా ఉన్న కిరాక్ ఆర్పీ రష్మీ గౌతమ్, అనసూయ ఎలాంటి వాళ్ళో చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్, యాంకర్స్, జడ్జెస్ గురించి తన అభిప్రాయం చెప్పాలని కిరాక్ ఆర్పీని యాంకర్ అడిగాడు...
57
Kiraak RP
రష్మీ గురించి కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ... రష్మీ అప్పటి వరకు ఉన్న యాంకర్స్ స్థాయికి మించిన యాంకర్. ఆమెకు తెలుగు సరిగా రాదు. భాష రాకుండా, తనకొచ్చిన స్లాంగ్ తో సక్సెస్ అయ్యింది. అప్పటి వరకు ఉన్న పరిస్థితులు మార్చిన అమ్మాయి. ఆమె తెలుగు బదులు తెగులు అన్నా కూడా నవ్వుకుంటాం... అన్నాడు.
67
Kirak RP
అనంతరం అనసూయ గురించి అడగ్గా.... యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా ప్రత్యేకమైన క్యారెక్టర్స్ తో తన స్థాయిని పెంచుకుంది. ఆమెకు సినిమాలకు కూడా బాగా సెట్ అయ్యింది... అని అన్నాడు. కిరాక్ ఆర్పీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
77
Kirak RP
సుధీర్ మల్టీ టాలెంటెడ్ అని, గెటప్ శ్రీను కమల్ హాసన్ అని, రామ్ ప్రసాద్ ఆటో డైలాగ్స్ కి ఫేమస్ అంటూ... వారి వారి ప్రత్యేకతలు కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు. కాగా జబర్దస్త్ మానేసిన కిరాక్ ఆర్పీ చేపల పులుసు వ్యాపారం చేస్తున్నాడు. అది సక్సెస్ కావడంతో లక్షలు సంపాదిస్తున్నాడు.