Janhvi Kapoor warning: ఖుషీ గురించి ట్రోల్స్ చేస్తే అంతు చూస్తా.. జాన్వీ కపూర్ వార్నింగ్

Published : Jul 20, 2022, 10:18 AM IST

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ వార్నింగ్ ఇచ్చింది. చిన్నగా కాదు చాలా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చింది. అది కూడా తనని ఏదో అన్నందకు కాదు తన చెల్లిని ఏమన్నా అంటారేమో జాగ్రత్తా ఊరుకోను అంటోంది. ఇంతకీ జాన్వీ వార్నింగ్ ఎందుక ఇచ్చింది..? ఎవరికిచ్చింది..? 

PREV
16
Janhvi Kapoor warning: ఖుషీ గురించి ట్రోల్స్ చేస్తే అంతు చూస్తా.. జాన్వీ కపూర్ వార్నింగ్

అతిలోక సుందరి దివంగ‌త అందాల తార శ్రీదేవి త‌న‌ కూతుర్లను హీరోయిన్లు గా చూడాలి అనుకుంది పెద్ద కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేసేలోపు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇక శ్రీదేవి మరణంతరువాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీక‌పూర్. త‌ల్లికి త‌గ్గ కూతురుగా పేరు తెచ్చుకునే ప‌నిలో బిజీగా ఉంది. 

26

జాన్వీక‌పూర్ బాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. సొంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోయిన్ల లిస్ట్ లో ప్లేస్ కొట్టేసింది. త్వరలో సౌత్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. శ్రీదేవి కల సగం నెరవేరినట్టే.. ఇక చిన్న కూతురు ఖుషీ ఎంట్రీ ఒక్కటి బ్యాలన్స్ ఉండిపోయింది. 

36

ఇక శ్రీదేవి-బోనీక‌పూర్ రెండో కూతురు ఖుషీక‌పూర్  ఎంట్రీకి కూడా రంగం సిథ్ధం అయ్యింది.  జోయా అఖ్త‌ర్  తెర‌కెక్కిస్తున్న ది ఆర్చీస్ మూవీతో ఖుషి కపూర్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ లాగానే ఖుషి కూడా తన సొంత కాళ్ల మీద నిలబడాలని పట్టుదలతో ఉంది. తనకంటూ సొంత ఇమేజ్ ను  క్రియేట్ చేసుకునే పనిలో ఉంది. 

46

ఇక శ్రీదేవి లేకపోవడంతో.. ఆమె స్థానంలో జాన్వీ కపూర్ ఖుషి బాధ్యతను తీసుకుంటుంది. త‌న సోద‌రి వ‌ర్క్ డెడికేషన్  గురించి చెప్పుకొచ్చింది జాన్వీక‌పూర్. ఖుషికి తాను రక్షణగా ఉంటానంటోంది. ఖుషీ గురించి మాట్లాడుతూ..నేను ఖుషీ  ప‌ని చూశాను. చాలా క‌ఠినంగా హార్డ్‌వ‌ర్క్ చేస్తుంది. ఆమె డెడికేష‌న్ చూసి చాలా సంతోషంగా ఉన్నానంటోంది. 
 

56

అంతే కాదు తనను ఎన్ని అన్నా భరించాను.. ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా.. సహించాను.. కాని తన చెల్లెలు  ఖుషీనుద్దేశించి ఎవ‌రైనా ఎలాంటి ట్రోలింగ్స్ నైనా చేస్తే ఊరుకోనంటోంది జాన్వీక‌పూర్‌. ఖుషీ గురించి ఎవ‌రైనా ఏదైనా చెడుగా మాట్లాడితే..వారి అంతు చూస్తానంటోంది. 

66

ఇక ఆర్చీస్ మూవీ లైవ్ యాక్ష‌న్ మ్యూజిక‌ల్ సినిమాగా తెరకెక్కుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌డు అగ‌స్త్య నందా మ‌రో లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో సూప‌ర్ 30 ఫేం మిహిర్‌ అహూజా, డాట్‌, యువ‌రాజ్ మెండా, వేదాంగ్ రైనా ను  కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక  జాన్వీక‌పూర్ విషయానికి వస్తే.. ఆమె లీడ్  రోల్‌లో న‌టించిన గుడ్ లక్ జెర్రీ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.  క్రైం కామెడీ డ్రామా నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ సినిమాకు జులై 29 రిలీజ్ కాబోతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories