సోకుల సునామి జాన్వీ కపూర్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. సినిమాలతో అభిమానులను సంపాదిచుకోవడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్నట్రెండ్ లో సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ పెంచుకోవడం మరో ఎత్తు. ఈ విషయంలో అందరికంటే ఒక అడుగు ముందే ఉంది జాన్వీ కపూర్. సోకులు ఎరవేసి యూత్ ఫాలోవర్స్ ను తన వైపు తిప్పుకుంటుంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాను కూడా ఒక ఊపు ఊపుతోంది జూనియర్ శ్రీదేవి. షూటింగ్ గ్యాప్ లో వెకేషన్ టూర్స్ తో సందడి చేస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి టూర్లకు వెళ్తూ.. అక్కడి అప్ డేట్ ను, ఎప్పటి కప్పుడు ఫ్యాన్స్ కు శేర్ చేస్తుంది. అంతే కాదు అదిరిపోయేలా అందాలు చూపిస్తూ.. స్పైసీ ఫోటోస్ తో.. తన పేజ్ ను నింపేస్తుంది జాన్వీ. రీసెంట్ గా వెకేషన్ కోసం బ్యారెన్ ఐలాండ్ కు వెళ్లింది జాన్వీ.
బ్యారెన్ ఐలాండ్ లో... బంగారు ఇసుక తిన్నెల మధ్య.. సొగసులు ఆరబెట్టుకుంటుంది బాలీవుడ్ బ్యూటీ. గమ్మత్తైన మత్తు ఎక్కేలా ఫోటోలకు ఫోజులిచ్చిన జాన్వీ.. ఇన్ స్టాలో ఈ పిక్స్ ను శేర్ చేసుకుంది. ఒళ్ళంతా కనిపించేలా పలుచని డ్రెస్ వేసుకుని సెగలు పుట్టిస్తోంది. గోల్డెన్ ఐలాండ్ లో బంగారు వన్నెలతో విరహం పుట్టిస్తుంది చిన్నది. జాన్వీ అందానికి ఫిదా అవుతున్నారు కుర్రాళ్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. జాన్వీ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.
అతిలోక సుందరి వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ కపూర్ చాలా తక్కువ టైమ్ లోనే క్లిక్ అయ్యింది. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ పక్కన పెడితే... స్వయం కృషితో ఎదుగుతుంది జాన్వీ. యాక్టింగ్ తో పాటు ముఖ్యంగా స్కిన్ షోతో సెగలు పుట్టిస్తంది. యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది అంటే.. జాన్వీ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే తన సొంత ఇమేజ్ తో స్టార్ గా మారిన హీరోయిన్ సౌత్ వైపు కూడా చూస్తోంది.
సౌత్ సినిమాల కోసం జాన్వీ కపూర్ కు ఇప్పటికే ప్రపోజల్స్ వెళ్లాయి. ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమా కోసం జాన్వీ కపూర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అటు విజయ్ దేవరకొండ, సుకుమార్ సినిమా కోసం కూడా జాన్వీని అనుకున్నారట. కాని ఈ ముద్దుగుమ్మ సౌత్ ప్లైట్ ఎక్కే ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. ఏ సినిమా ఇకాం అఫీషియల్ గా ఫిక్స్ అవ్వలేదు. ఇప్పటికే ఆలియా భట్ సౌత్ ఎంట్రీ ఇచ్చేసింది. ట్రిపుల్ ఆర్ తో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది.
త్వరలో జాన్వీ కపూర్ కూడా మంచి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరో తో సినిమా చేస్తే... పాన్ ఇండియా స్టార్ గా మారిపోవచ్చని చూస్తుంది జాన్వీ. అందుకే సౌత్ లో కూడా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇప్పటికే ఇన్ స్టా ఫాలోవర్స్ లో పెద్ద పెద్ద స్టార్స్ ను మించిపోయింది జాన్వీ. 1 కోటి 49 లక్షల మంది ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది. ముందు ముందు జాన్వీ స్టెప్స్ ఎటువైపు వేస్తుందో చూడాలి.