జాన్వీ కపూర్ తరచుగా వివిధ రకాల అవుట్ ఫిట్స్ లో మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది. తన సొగసుతో.. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా మాయ చేస్తూ ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ బ్లూ కలర్ శారీ, బ్రాని తలపించేలా ఉన్న బ్లౌజ్ లో ఉప్పొంగే అందాలతో మైండ్ బ్లాక్ చేస్తోంది. సాధారణంగా జాన్వీ కపూర్ లాంటి స్టార్ బ్యూటీ గ్లామర్ గా కనిపించాలంటే హెయిర్ స్టైలిస్ట్, మేకప్ అసిస్టెంట్ ఇలా చాలా మంది కష్టం ఉంటుంది. కానీ బ్లూ శారీలో బౌండరీలు బ్రేక్ అయ్యే గ్లామర్ ప్రదర్శించడానికి తానే స్వయంగా మేకప్ వేసుకున్నట్లు జాన్వీ క్యాప్షన్ ఇచ్చింది.