ఊరించే లిప్స్ తో కలవరపెడుతున్న కృతి శెట్టి.. నిషా కళ్లతో కుర్రాళ్లకు మత్తెక్కించేలా చూస్తున్న బేబమ్మ

First Published | Jul 28, 2023, 8:06 PM IST

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty)  రోజుకో తీరుగా నెట్టింట అందాల విందు చేస్తోంది. తాజాగా క్లోజప్ షార్ట్ లో బేబమ్మ ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది.
 

‘ఉప్పెన’ సినిమాతో కృతిశెట్టి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు దక్కించుకుంది. బ్యూటీఫుల్ లుక్ తోపాటు అద్భుతమైన నటనతో ఆడియెన్స్ ను మెప్పించింది. నూటికి నూరు శాతం మార్కులు పొందింది. 
 

ఆవెంటనే ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లోనూ నటించి హిట్ అందుకుంది. దీంతో ఎంట్రీతోనే హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్న హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసుకుంది. లక్కీ హీరోయిన్ గానూ మారిపోయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లు వచ్చాయి. 
 


కానీ ఆ తర్వాత వచ్చిన ‘ది వారియర్’. ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో కృతి జోరుకు బ్రేక్ లు పడ్డాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ‘కస్టడీ’ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బేబమ్మకు టాలీవుడ్ లో ఆఫర్లు కష్టమేనన్నట్టుగా పరిస్థితి మారింది. 
 

ప్రస్తుతం తమిళం, మలయాళంలో తన లక్క్ ను పరీక్షించుకుంటోంది. మలయాళంలో టోవినో థామస్ చిత్రంతో పాటు, తమిళంలో జయం రవి సరసన ‘జీనీ’ మూవీల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. వాటి ఫలితాలను బట్టి అక్కడ ఈ కుర్రభామ కెరీర్ ఆధారపడి ఉందంటున్నారు.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం కృతి శెట్టి నెమ్మదిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఈమేరకు వరుసగా ఫొటోషూట్లు చేస్తూ.. ఆ గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. రోజుకోతీరుగా దర్శనమిస్తూ అందాల విందు చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

తాజాగా బేబమ్మ బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది. వైట్ టాప్ ధరించిన కృతిశెట్టి క్లోజప్ షార్ట్ లో ఫోజులిచ్చింది. ఊరించే లిప్స్ తో మైమరిపించింది. కురుల అందంతోనూ ఆకట్టుకుంది. మరోవైపు మత్తెక్కించే కళ్లతో గుచ్చే చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తుగా చూస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో పిక్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!