Janhvi kapoor Birthday : పుట్టిన రోజున శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్.. చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా..

Published : Mar 06, 2022, 02:21 PM IST

దివికెగిసిన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi kapoor) సంప్రదాయ దుస్తుల్లో అచ్చు తెలుగమ్మాయిలా ఆకట్టుకుంటోంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు తిరుపతిలో  శ్రీవారిని దర్శించుకుంది.   

PREV
17
Janhvi kapoor Birthday : పుట్టిన రోజున శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్.. చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా..

అందాల తార, దివంగత శ్రీదేవి (Sri Devi) కూతురు జాన్వీ కపూర్‌ తన పుట్టిన రోజు వేడుకలను చాలా సంప్రదాయంగా జరుపుకుంది. ఈ సందరర్భంగా చిగురు ఆకుపచ్చ పట్టుచీర ధరించిన మ్యాచింగ్ బ్లౌజ్ ధరించిన జాన్వీ కపూర్ అచ్చు తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. 

27

తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రానికి చేరుకున్న జాన్వీ కపూర్.. ఈ రోజు ఉదయమే శ్రీవారి సన్నిది ప్రత్యేక పూజలు చేసింది. వీవీఐపీ ద్వారా వేంకటేశ్వరుడి దర్శనం చేసుకుంది.  
 

37

తన స్నేహితురాలితో కలిసి మొక్కులు చెల్లించుకున్న జాన్వీ దర్శనానతంరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది జాన్వీ కపూర్ ను, తన స్నేహితురాలులను స్వాగతించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారు. 
 

47

అయితే జాన్వీ కపూర్ తన స్నేహితుల పాటు, శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్లింది. ఈ సందర్భంగా మెట్లు ఎక్కుతూ తన ఫ్రెండ్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. మొత్తంగా దర్శనం పూర్తి చేసుకున్న జాన్వీ చీరకట్లులో అందరినీ ఆకట్టుకుంది. 

57

తాజాగా జాన్వీ కపూర్ తిరుమల తిరుపతి దేవస్థాన సందర్శనకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తన స్నేహితురాళ్లతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

67

ఈ ఫొటోలు పంచుకుంటూ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ‘ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమో నమ:, శ్రీమన్నారాయణ  నమో నమ:, తిరుమల తిరుపతి నమో నమ :, జై బాలాజీ నమో నమ:’ అంటూ శ్రీవారి  నామస్మరణ చేసింది.  

77

ప్రస్తుతం జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో జాన్వీ ఎంత అందంగా ఉందో అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. ఇక జాన్వీ సౌత్ ఎంట్రీపై ఇటీవల బోణీ కపూర్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు. దీంతో జాన్వీ ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories