ఇంతకన్నా వరస్ట్ ఉంటుందా.. జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ తో చెల్లి ఖుషి కపూర్ డేటింగ్ ?

Published : Oct 28, 2022, 01:59 PM IST

శ్రీదేవిలాగా జాన్వీ కపూర్ అతిలోక సుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. ఆమె చెల్లి ఖుషి కపూర్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అక్క తరహాలోనే గ్లామర్ షోలో రెచ్చిపోతోంది.

PREV
16
ఇంతకన్నా వరస్ట్ ఉంటుందా.. జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ తో చెల్లి ఖుషి కపూర్ డేటింగ్ ?

శ్రీదేవిలాగా జాన్వీ కపూర్ అతిలోక సుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. 

26

ఆమె చెల్లి ఖుషి కపూర్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అక్క తరహాలోనే గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. పాపులారిటీ కోసం స్కిన్ షోలో రెచ్చిపోతోంది. కానీ జాన్వీ కపూర్ తరహాలో ఖుషి కపూర్ కి బాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. 

36

జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇద్దరి లవ్ అఫైర్స్ గురించి గతంలో చాలా రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ ని శ్రీదేవి కుమార్తెలు ఇద్దరూ అంగీకరించలేదు అలాగని ఖండించనూ లేదు. తాజాగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన ఓ షాకింగ్ రూమర్ పై స్పందించింది. 

46

తన గురించి వచ్చిన వరస్ట్ రూమర్ ఏంటి అని ప్రశ్నించగా జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నేను నా చిన్ననాటి స్నేహితుడు అక్షత్ రాజన్ తో డేటింగ్ చేశానని.. మేమిద్దరం విడిపోయాక ఖుషి కపూర్ అతడితో డేటింగ్ మొదలు పెట్టినట్లు రూమర్స్ వచ్చాయి. ఇది చదువుతునప్పుడు నాకు చాలా అసభ్యంగా, దారుణంగా అనిపించింది. 

56

నా గురించి వచ్చిన వరస్ట్ రూమర్ ఇదే అని జాన్వీ కపూర్ తెలిపింది. అక్కా చెల్లెళ్ళ గురించి మరీ ఇంత దారుణంగా రూమర్స్ సృష్టించవద్దని కోరింది. అక్షత్ మా స్నేహితుడు మాత్రమే. నేను కానీ, ఖుషి కానీ అక్షత్ తో ఎప్పుడూ డేటింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. 
 

66

జాన్వీ కపూర్ ప్రస్తుతం మిలి అనే చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. తరచుగా జాన్వీ చేస్తున్న ఫోటో షూట్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్లని మించేలా జాన్వీ కపూర్ గ్లామర్ బ్లాస్టింగ్ సృష్టిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories