Focus Movie Review: ఆషురెడ్డి `ఫోకస్‌` మూవీ రివ్యూ

First Published | Oct 28, 2022, 1:57 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన చిత్రం `ఫోకస్‌`. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం శుక్రవారం(అక్టోబర్‌ 28)న విడుదలైంది. మరి ఆడియెన్స్ నిఎంగేజ్‌ చేసిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

బిగ్‌ బాస్‌ బ్యూటీ, గ్లామర్‌ సెన్సేషనల్‌ ఆషురెడ్డి హీరోయిన్‌గా నటించిన చిత్రం `ఫోకస్‌`. యంగ్‌ అప్‌కమింగ్‌ హీరో విజయ్‌ శంకర్‌ హీరోగా, సుహాసిని మణిరత్నం, భానుచందర్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సూర్యతేజ దర్శకత్వం వహించారు. వీరభద్రరావు పరిస నిర్మించిన `ఫోకస్‌` చిత్రం శుక్రవారం(అక్టోబర్‌ 28)న విడుదలైంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ వారం చిన్న చిత్రాలకు కలిసొచ్చింది. దీంతో మూడు నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో `ఫోకస్‌` ఒకటి. మర్దర్‌ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది `ఫోకస్‌` (Focus Review) రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రమిది. ఇన్వెస్టిగేషన్‌ ప్రధానంగా కథ నడుస్తుంది. వివేక్‌ వర్మ(భాను చందర్‌), ప్రమోదా దేవి(సుహాసిని) అన్యోన్యమైన దంపతులు. ప్రమోదా దేవి జడ్జ్ గా, వివేక్‌ వర్మ ఎస్పీగా పనిచేస్తుంటారు. వీరిద్దరు ఓ రోజు తమ గెస్ట్ హౌజ్‌కి వెళ్తారు. ఆ రోజు రాత్రి ఎస్పీ వివేక్‌ వర్మ హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసిందెవరనేది ఇన్వెస్టిగేషన్‌ చేసే బాధ్యత ఎస్‌ఐ విజయ్‌ శంకర్‌(హీరో)కి అప్పగిస్తారు. డీసీపీ(జీవా) సారథ్యంలో, అలాగే సీపీ షియాజీ షిండే ల నాయకత్వంలో ఈ ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుంది. తొలుత ఎస్పీని చంపింది తానే అని నటుడు సూర్యభగవాన్‌ పోలీసులకు లొంగిపోతాడు, దీంతో కేస్‌ క్లోజ్‌ అయ్యిందనుకుంటారు. అంతలో మరో ట్విస్ట్, వివేక్‌ వర్మ గెస్ట్ హౌజ్‌లో పనిచేసే పని మనిషే డబ్బు కోసం హత్య చేసినట్టు తెలుస్తుంది. దీంతో కేస్‌ క్లోజ్‌ అని మరోసారి భావిస్తారు;? అంతలో మరో ట్విస్ట్ పోస్ట్ మార్టమ్‌ రిపోర్ట్ లో అతను విషం తీసుకున్నట్టు వస్తుంది. ఆ తర్వాత మరో ట్విస్ట్ మరి ఇంతకి వివేక్‌ వర్మ ఎలా చనిపోయాడు, ఈ కేసుకి ఆయన భార్య జడ్జ్(సుహాసిని)కి, ఆరేళ్ల క్రితం రేప్‌ కి గురై హత్యగావించబడ్డ సూర్యభగవాన్‌ కూతురి కేసుకి ఏంటి సంబంధం అనేది మిగిలిన సినిమా. Focus Movie Review.

Latest Videos


విశ్లేషణః 
మర్డర్‌ మిస్టరీలో సినిమా ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంటుంది. ఎంత సస్పెన్స్ ఉంటే, ఎంత ఉత్కంఠంగా స్క్రీన్‌ప్లే సాగితే ఆడియెన్స్ అంతగా ఎంగేజ్‌ అవుతుంటాడు, సినిమాతో కనెక్ట్ అవుతుంటారు. ఈ సినిమాలో కావాల్సిన ట్విస్ట్ లు, టర్నింగ్‌ పాయింట్‌ లు ఉండటం విశేషం. సినిమా బలం అదే. దర్శకుడు సూర్యతేజ సినిమాని అనేక మలుపులతో తీసుకెళ్లిన తీరు బాగుంది. మొదటి భాగంతో పోల్చితే రెండో భాగంలో ఉన్న ట్విస్ట్ లు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా వేగం పెంచుతాయి. అదే మాదిరిగా మొదటి భాగంలో ఉంటే ఇంకా బాగుండేది. బోర్ ఫీలింగ్‌ రాకుండా ఉండేది. కానీ అప్‌కమింగ్‌ దర్శకుడైనా శక్తిమేర తన ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఊహించని మలుపులతో కథని నడిపించిన విధానం బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే పరంగా ఇంకాస్త గ్రిప్పింగ్‌గా డీల్‌ చేయాల్సి ఉంది. 

మొదటి భాగంలో వినోదానికి ఛాన్స్ ఉన్నా ఎందుకో ఆ ఫ్రీడమ్‌ తీసుకోలేదనిపిస్తుంది. నటీనటుల నటన పరంగా ఇంకాస్త కేర్‌ తీసుకోవాల్సి ఉంది. చాలా చోట్ల వాళ్లు ఏం చేస్తున్నారో అయోమయం కలగ చేస్తుంది. హీరో విజయ్‌ శంకర్‌ పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసిన తీరు ఉన్నంతలో ఫర్వాలేదు. ఇంకా చెప్పాలంటే తనే సినిమాని తన భుజాలపై నడిపించాడు. సినిమా నిడివి కూడా సినిమాకి ప్లస్‌ అయ్యింది. ఇలాంటి మర్డర్ మిస్టరీలకు ఆర్‌ఆర్‌ ముఖ్యం ఆ విషయంలో దర్శకుడు ఇంకా కేర్‌ తీసుకోవాల్సి ఉంది. మొత్తంగా స్క్రీన్‌ ప్లేని గ్రిప్పింగ్‌గా నడిపిస్తే సినిమా ఫలితం బాగుండేది. 
 

నటీనటులుః
సినిమాని హీరో విజయ్‌ శంకర్‌ పాత్రనే నడిపిస్తుంది. అతను అప్‌ కమింగ్‌ యాక్టర్‌ అయినా ఉన్నంతలో బాగా చేశాడు. పోలీస్‌ డ్రెస్‌లో లుక్‌ బాగుంది. హవభావాల విషయంలో ఇంకా ఇంప్రూవ్‌ కావాలి. చాలా చోట్ల మెప్పించాడు. సుహాసిని పాత్ర ఉన్న కాసేపే అయినా రక్తికట్టించింది. సెకండాఫ్‌లో వచ్చే పోలీస్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌గా ఆషురెడ్డి ఉన్న కాసేపే అయినా రఫ్ఫాడించింది. హత్యకు గురైన ఎస్పీగా భానుచందర్‌ ఓకే అనిపించారు. హీరోకి సహాయకుడిగా ఉండి, హత్యలో భాగమైన పోలీస్‌ పాత్రలో భరత్‌ రెడ్డి మెప్పించాడు. పోలీస్‌ ఆఫీసర్లుగా జీవా, షియాజీ షిండేల, హత్యకేసులో నింధితుడిగా ఉన్న సూర్యభగవాన్‌ ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసుకుంటూ వెళ్లారు. 
 

టెక్నీషియన్లుః

దర్శకుడు సూర్యతేజ ఎంచుకున్న మర్డర్‌ మిస్టరీ కథ బాగుంది. ట్విస్ట్ లు అదిరిపోయేలా ఉన్నాయి. కానీ స్క్రీన్‌ ప్లేని గ్రిప్పింగ్‌గా, పరుగులు పెట్టించేలా తీసుకెళ్తే, ఇంకా బాగుండేది. కెమెరావర్క్ విషయంలోనూ ఇంకా పనితనం చూపించాల్సి ఉండాల్సింది. వినోద్‌ యాజమాన్య సంగీతం, బీజీఎం సినిమాలో తేలిపోయింది. సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలకు ఉండాల్సిన విధంగా ఆర్‌ఆర్‌ మిస్ అయ్యింది. సత్య జి ఎడిటింగ్‌ కూడా ఇంకా తన కత్తెరకు పనిచెబితే బాగుండేది. రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకి కావాల్సిన విధంగా ఖర్చుచేశారు.

ఓవరాల్‌గా సినిమా ఆద్యంతం ట్విస్ట్ లతో సాగే మర్డర్‌ మిస్టరీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు. 
 

click me!