ఆ తర్వాత భానుమతి జానకి,రామచంద్ర ముగ్గురు కలిసి ఆరుబయట భోజనం చేస్తూ ఉంటారు. తర్వాత భానుమతి రామచంద్ర,జానకికి ఇద్దరికీ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఆ తరువాత జానకి, రామచంద్ర ఇద్దరు పరుగులు తీస్తూ అలా తిరిగిరావడానికి వెళ్తారు. ఇప్పుడు రామచంద్ర ని జానకి చాకలిగింతలు పెడుతూ నవ్విస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. జానకి గారు ఊరికే ఉండండి నాలో ఉన్న రామచంద్ర నిద్రలేస్తాడు అని అనగా అవునా ఎలా ఎక్కడ ఉన్నాడు అంటూ మరింత ఆట పట్టిస్తూ ఉంటుంది జానకి. అప్పుడు వెంటనే రామచంద్ర జానకిని ఆట పట్టిస్తూ చక్కలిగింతలు పెడుతూ ఉంటాడు.