అప్పుడు సత్య, ఆదిత్య ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు నన్ను బయటకు తీసుకెళుతున్నాను అని కూడా గుర్తులేదు అని బాధపడుతుంది. ఆ తర్వాత సీన్లో రుక్మిణి బట్టలు ఆరేస్తూ ఉండగా మాధవ్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. అప్పుడు జానకమ్మ, మాధవ్ ఫోటోలు తీయడం చూసి, ఆపి చెంప మీద ఒకటి కొడుతుంది. అసలు ఏం జరుగుతుంది రా? ఆ రాదని ఫోటోలు తీయడమేంటి. పాపం ఇది రాద చూస్తే ఎంత బాధ పడుతుంది? ఆ రాదే లేకపోతే నువ్వు,నీ కూతురు జీవితం సంపూర్ణం అయ్యేది కూడా కాదు. తన భర్త ఎవరో కూడా మనకి తెలీదు ప్రతిరోజు నరకం అనుభవిస్తుంది నువ్వు మధ్యలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అని చెప్పి ఫోన్ పగలగొట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు మాధవ్, మనసులో నువ్వు ఎన్ని చెప్పినా నాకు రాద కావాలమ్మా. రాదని వదలను అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!