Bigg Boss 10: పాపం నరేష్ కి హ్యాండిచ్చిన బిగ్ బాస్, అమన్ కష్టానికి ప్రతిఫలం.. సిగ్గులేని ఆట అంటూ ముకేశ్ ఫైర్

Published : Oct 22, 2026, 10:55 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో అమన్ కి ప్రారంభం నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కానీ తొలిసారి అతడి కష్టానికి ప్రతిఫలం దక్కింది. పాపం బిగ్ బాస్ నిర్ణయంతో నరేష్ కి మొండిచేయి తప్పలేదు.

PREV
15
బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో గురువారం రోజు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళు గోట్ అయ్యే అవకాశం కోల్పోయారు. ఇక ఎల్లో జోన్ లో ఉన్న వారికి గోట్ అయ్యే అవకాశం ఉందని బిగ్ బాస్ తెలిపారు. కాయాన్ని టాస్క్ లో విజయం సాధించాలి. దీని కోసం బిగ్ బాస్ వెయిట్ లిఫ్ట్ చేసే టాస్క్ ఇచ్చారు.

25
బరువు బ్యాలెన్స్ చేసే టాస్క్

ఈ టాస్క్ లో భాగంగా ఎల్లో జోన్ లో ఉన్న సభ్యులంతా తమ భుజాలపై ఒక కర్రని పెట్టుకోవాలి. బజర్ మోగిన ప్రతిసారీ సంచాలకులు మిగిలిన సభ్యుల్లో ఒకరిని పిలుస్తారు. బిగ్ బాస్ చెప్పిన నంబర్ ప్రకారం ఎవరికైనా ఆ వెయిట్ ని కర్రలకు తగిలించాలి. ఎవరికి వెయిట్ ఇవ్వాలి అనేది వెయిట్ వేసే సభ్యుడి ఇష్టం. ఈ క్రమంలో శివకుమార్ ఒక్కసారిగా ముకేశ్ కి 12 వెయిట్స్ వేశారు. కావాలని టార్గెట్ చేసి తనపై వెయిట్స్ వేశాడని ముకేశ్.. శివకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

35
శివ సిగ్గులేని ఆట ఆడుతున్నాడు

విశ్వాసం లేకుండా సిగ్గులేని ఆట ఆడుతున్నావ్ అంటూ ముకేశ్ మండిపడ్డాడు. ఇలా ఒక్కొక్కరిపై వెయిట్స్ పెరుగుతూ వచ్చాయి. ముందుగా వర్షిణి బరువు మోయలేక డ్రాప్ అయిపొయింది. ఆ తర్వాత నీతూ, శివకుమార్, త్రిగున్ ఇలా ఒక్కొక్కరుగా బరువు బ్యాలెన్స్ చేయలేక డ్రాప్ అవుతూ వచ్చారు. నీతూ ఎక్కువ సేపు ఎక్కువ బరువు మోసింది. మహిళల్లో ఎక్కువ సేపు దేబ్జానీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఆమె కూడా కొంత సమయానికి డ్రాప్ అయింది.

45
పోరాడిన అమన్

ఇక చివరికి రామ్ ప్రసాద్, అమన్, నరేష్ మిగిలారు. అమన్ పై క్రమంగా బరువు పెరుగుతూ వచ్చింది. కానీ అమన్ బ్యాలెన్స్ చేస్తూ నొప్పిని భరించాడు. నరేష్ కి మాత్రం ఇంటి సభ్యుల నుంచి సానుభూతి లభించింది. అతడికి ఎవరూ అంతగా వెయిట్స్ వేయలేదు. రామ్ ప్రసాద్ కూడా బరువు మోయలేక డ్రాప్ అయ్యాడు. ఇక మిగిలింది నరేష్, అమన్ మాత్రమే. అప్పటికే అమన్ తీవ్రమైన నొప్పి భరిస్తూ డ్రాప్ అయ్యే పరిస్థితిలో ఉన్నాడు. ఇక వెయిట్స్ వేసే వంతు ముకేశ్ కి వచ్చింది. తాను అమన్ కి వేస్తానని ముకేశ్ తెలిపాడు. అమన్ బతిమాలుకున్నాడు. అయినా కూడా ముకేష్ అతడికే వేయాలని డిసైడ్ అయ్యాడు. దీనితో అమన్ బరువు పెరిగిపోవడంతో డ్రాప్ అయి కుప్ప కూలాడు.

55
అమన్ కష్టానికి ప్రతిఫలం, పాపం నరేష్

ప్రతిసారి చివరి నిమిషంలో గేమ్ చేజారుతుండడంతో అమన్ ఎంతో మనస్తాపానికి గురై హౌస్ లో తనకు సాయం చేసేవాళ్ళు లేరు అంటూ ఆవేదన చెందాడు. అమన్ డ్రాప్ కావడంతో చివరి వరకు బ్యాలెన్స్ చేసిన నరేష్ విజయం సాధించినట్లు అంతా భావించారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. నరేష్ చివరి వరకు గేమ్ లో ఉన్నప్పటికీ ఇంటి సభ్యులు ఎవరూ అతడికి వెయిట్స్ వేయలేదు. కానీ అమన్ అందరి కంటే ఎక్కువ సమయం ఎక్కువ బరువులు మోశాడు. కాబట్టి ఈ టాస్క్ లో అమన్ విజేత అని బిగ్ బాస్ ప్రకటించారు. దీనితో అమన్ గ్రీన్ జోన్ లోకి చేరుకొని గోట్ గా నిలిచాడు. బిగ్ బాస్ మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. మహిళల్లో ఎక్కువ సమయం ఎక్కువ బరువులు మోసిన దేబ్జానీ, నీతూలకు కూడా గ్రీన్ జోన్ లో అవకాశం ఇస్తూ వాళ్ళని కూడా గోట్ గా ప్రకటించారు. దీనితో అమన్, దేబ్జానీ, నీతూ లకు ఈ వారం, వచ్చే వారం ఎలిమినేషన్ నుంచి ఇమ్యూనిటీ లభించింది.

Read more Photos on
click me!

Recommended Stories