ఈ రోజు ఎపిసోడ్ లో రిషి అడిగే ప్రశ్నలకు వసుధార సమాధానం చెబుతూ జగతి మేడం తను నా గురువు తను నా గైడ్ అని మాట్లాడుతూ ఉంటుంది వసుధార. తను చూస్తే ధైర్యం పెరుగుతుంది అని చెబుతూ ఉండగా మరొకవైపు వసుధార, జగతి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు జగతి దూరం నుంచి రిషి, వసుధార చూసి సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు దేవయాని మరొక ప్లాన్ వేస్తూ చెప్పింది గుర్తుంది కదా ఈసారి నేను చెప్పినట్టు జరగాలి మరిచిపోవద్దండి అని అంటుంది. మీరు చేయాల్సింది మీరు చేయండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విని ధరణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.