ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు సౌందర్యకి,ఆనంద్ రావు టాబ్లెట్స్ ఇవ్వగా అప్పుడు జరిగింది మొత్తం తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్య నన్ను తలపై కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి హైదరాబాద్ శివారులో వదిలిపెట్టింది అంటే అది మామూలు ఆడది కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు సౌందర్య, ఆనందరావు. ఇప్పుడు సౌందర్య ఆనందరావు మాట్లాడుతూ ఆ మోనిత ప్రవర్తన శౌర్య అన్న మాటలను బట్టి చూస్తే నిజంగానే కార్తీక్ దీప లు ఆ ఊర్లో ఉన్నారని నాకు అనిపిస్తోంది అంటుంది సౌందర్య. కార్తీక్,దీప లు బతికే ఉన్నారేమో కార్తీక్ మోనిత దగ్గర ఉండటం వల్ల నా తల పగలగొట్టిందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య.