హాట్ టాపిక్ : వైయస్ షర్మిళ కొడుకు హీరోగా లాంచ్ ? , డైరెక్టర్ ఎవరంటే...

Published : Jul 09, 2023, 10:29 AM ISTUpdated : Jul 09, 2023, 10:47 AM IST

ఎస్సార్ టీపీ అధినేత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ని హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఆ కుటుంబం అంతా ఉందని వినికిడి.

PREV
111
హాట్ టాపిక్ : వైయస్ షర్మిళ కొడుకు హీరోగా లాంచ్ ? , డైరెక్టర్ ఎవరంటే...
Y.S. Sharmila son


సినిమా హీరోగా అవ్వాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఆ అదృష్టం కొందరికే వరిస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో దర్శకులుగానో, నిర్మాతలగానో, హీరోలగానో వెలుగుతున్న వారు తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తూంటారు. అయితే ఇప్పుడు సమాజంలో వేర్వేరు వర్గాల నుంచి వచ్చి హీరోలగా ట్రైల్స్ వేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారి తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తున్నారు. తామే పెట్టుబడి పెడుతూ ఓ ప్రయత్నం చేస్తున్నారు. 

211
Y.S. Sharmila son


ఆ క్రమంలో చాలా మంది పొలిటీషన్స్ పిల్లలు ఇప్పటికే సినిమాల్లోకి వచ్చారు. వస్తున్నారు. తాజాగా వైయస్ షర్మిళ కొడుకు హీరోగా లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా నిలదొక్కుకునేలా భారీగా లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

311
Y.S. Sharmila son


 వైఎస్సార్ టీపీ అధినేత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ని హీరోగా లాంచ్ చేయాలని ఆ కుటుంబం భావిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వినికిడి.

411
Y.S. Sharmila son


ఇక ఈ కొత్త కుర్రాడుని హీరోగా లాంచ్ చేయబోతున్న దర్శకుడు పూరి జగన్నాథ్ అని చెప్తున్నారు. ఇప్పుటికే పూరి జగన్నాథ్ ఓ కథ చెప్పారని, ఆ కథ పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ గా నడిచే ఫ్యామిలీ డ్రామా అని అంటున్నారు. అప్పట్లో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ని ఎలా లాంచ్ చేసారో అదే విధంగా ఈ కుర్రాడని అదే స్దాయిలో భారీగా సినిమా చేసి నిలబెట్టబోతున్నారట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న విషయాలు ఇవి. 

511
Y.S. Sharmila son


వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ఇప్పటికే హీరో అవ్వటానికి అన్ని ట్రైనింగ్ లు అమెరికాలో తీసుకున్నాడంటున్నారు. అక్కడ నటన కోర్స్ చేసాడని చెప్తున్నారు. అలాగే శరీర ధారుడ్యం విషయంలోనూ ఫెరఫెక్ట్ గా ఉండటం కలిసొచ్చే విషయం అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అందంగా హీరోలా ఉన్నాడని అతన్ని లైవ్ లో చూసిన వారు చెప్తున్నారు.

611
Y.S. Sharmila son


లాస్ట్ ఇయిర్  వైఎస్ రాజారెడ్డి అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఆ  సందర్భంగా వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో షర్మిల కుటుంబం పాల్గొంది.అమెరికాలోని డ‌ల్లాస్ యూనివ‌ర్సిటిలో బ్యాచ్ ల‌ర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ కోర్స్ పూర్తిచేసుకొన్నాడు.

711
Y.S. Sharmila son


 వైఎస్ ష‌ర్మిల త‌న‌యుడు వైఎస్ రాజారెడ్డి  డ‌ల్లాస్  యూనివ‌ర్సిటి నుంచి ప‌ట్టా అందుకుకున్నారు. ఈ కార్యక్రమానికి షర్మితతోపాటు కుటుంబీకులు హాజరయ్యారు.డల్లాస్ యూనివ‌ర్సిటిలో జ‌రిగిన కాన్వ‌కేష‌న్ కు ష‌ర్మిలతోపాటు ఆమె భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ, కూతురు అంజలి రెడ్డి తరలివెళ్లారు. కాన్వ‌కేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కుటుంబం రాజారెడ్డి గారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

811
Y.S. Sharmila son


ఇక హీరోగా లాంచ్ అయితే ఖచ్చితంగా వైయస్ అభిమానులు అందరి అండదండలు ఉంటాయనేది నిజం. రిలిజ్ కు ముందే మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందులోనూ వైయస్ జగన్ కు, షర్మిలకు పూరి జగన్నాథ్ బాగా పరిచయం కావటం కూడా కలిసొచ్చే అంశం.

911


కొడుకు వైఎస్ రాజారెడ్డి పట్టభద్రుడైన సంద‌ర్బంగా వైఎస్ ష‌ర్మిల భావోద్వేగ ప్రకటన చేశారు. తన కొడుక్కి తాత (రాజారెడ్డి) పేరు పెట్టుకున్న షర్మిల.. వ్యవహారంలో మాత్రం కొడుకును నాన్నా అని పిలుచుకుంటారు. పెద్దవాడివై, డిగ్రీ పొందినా పక్కవారిని గౌరవించడం మానొద్దంటూ కొడుక్కి షర్మిల హితబోధ చేశారు.
 

1011
Y.S. Sharmila son


ఆ సందర్బంగా‘గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసినందుకు నీకు శుభాకాంక్ష‌లు రాజా.. బుడిబుడి అడుగుల‌తో నా చేతుల్లో పెరిగిన నువ్వు.. ఇవాళ ఇంత గొప్ప వ్యక్తిగా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది.నిజాయితీ,ద‌య‌తో కూడి ఉండు. నీ చుట్టూ ఉన్న‌వారిని గౌర‌వించు.. ఆ దేవుడి కృప నీకు ఉంటుంది. ఎంతోమంది దీవెన‌లు నువ్వు అందుకుంటావు..చాలా గ‌ర్వంగా ఉంది నాన్న..’ అని షర్మిల ట్వీట్ చేసిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. 

1111

పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ఎనౌన్స్ చేశారు. దీని పేరు డబుల్ ఇస్మార్ట్. రామ్ పుట్టినరోజు (మే 15) సందర్భంగా ఈ సినిమాను టైటిల్ తో సహా ఎనౌన్స్ చేశారు. అంతేకాదు.. విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘డబుల్ ఇస్మార్ట్’ అని పేరు పెట్టారు. ఇది ఈసారి రెట్టింపు మాస్ ,రెట్టింపు వినోదాన్ని ఇవ్వబోతుందని చెబుతోంది యూనిట్. పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగిన కథను రాశాడట. అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో హై బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందట.

click me!

Recommended Stories