పింక్ టాప్.. ఎల్లో మినీ స్కర్ట్ లో వర్ష కిర్రాక్ ఫోజులు.. గ్లామర్ విందులో హద్దులు చెరిపేస్తున్న యంగ్ బ్యూటీ

First Published | Jun 23, 2023, 12:22 PM IST

జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. అదే సమయంలో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. 
 

బుల్లితెరపై జబర్దస్త్ వర్ష సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కామెడీ స్కిట్లలో నటిస్తూ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే తనకు కావాల్సిన క్రేజ్ ను సంపాదించుకుంది. 
 

ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కంటే ముందు సీరియల్స్ నటించింది. అక్కడి నుంచే తన కేరీర్ ప్రారంభమైంది. కానీ అలా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. కొన్నాళ్లకు కామెడీ షో ‘జబర్దస్త్’లో అవకాశం దక్కించుకుని తన టాలెంట్ తో ఎదుగుతూ వస్తోంది.
 


Jabardasth వేదిక నుంచి ఇప్పటికే చాలా మంది అందాల గుమ్మలు మంచి పొజిషన్ కు చేరుకున్నారు. యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్ వంటి వాళ్లు సినిమాల్లోనూ అలరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు  సుడిగాలి సుధీర్, వేణు, షకలక శంకర్ కూడా వెండితెరపై అలరిస్తున్నారు.
 

ప్రస్తుతం వర్ష కూడా వారి బాటలోనే పయనించేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కేవలం జబర్దస్త్ లో కామెడీ పండించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. వీలైనంత క్రేజ్ పొందేందుకు ప్రయత్నిస్తోంది.

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ నెట్టింట గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో దర్శనమిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. మొదట్లో కాస్తా పద్ధతిగా మెరిసిన వర్ష ప్రస్తుతం అందాల విందులో అదరగొడుతోంది.
 

తాజాగా వర్ష చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. పింక్ టాప్, ఎల్లో కలర్ మినీ స్కర్ట్ లో అందాలను ఆరబోసింది. బెడ్ పై రకరకాల ఫోజులతో మతులు చెడగొట్టింది. మత్తెక్కించే చూపులతో యువతను చిత్తు చేసింది.
 

రోజురోజకు ఇలా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్న వర్ష ఫాలోయింగ్ ను కూడా అలాగే పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి  1 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఆ సంఖ్యను మరింతగా పెంచేందుకు గ్లామర్ వల విసురుతూ వస్తోంది. 
 

ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ మెరుస్తోంది. చలాకీతనం, బ్యూటీఫుల్ లుక్స్, అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ తోనూ ప్రేమ వ్యవహరం అంటూ మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంటోంది. 
 

Latest Videos

click me!