ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వర్ష-ఇమ్మానియేల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి హైపర్ ఆది కారణమయ్యాడు. వర్ష వేరొక వ్యక్తితో రీల్స్ చేసిందని ఇమ్మానియేల్ కి ఆది చెప్పాడు. ఛస్తే చేయదు. నేను నమ్మను అని ఇమ్మానియేల్ అన్నాడు. దాంతో చూడు అంటూ... వర్ష ఓ అజ్ఞాత వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియోలు వేదిక మీద ప్లే చేశాడు.