ఇమ్మానియేల్ ఇంటి కోడలిగా జబర్దస్త్ వర్ష... కంగ్రాట్స్ చెప్పిన జబర్దస్త్ టీమ్స్ .. పెళ్ళికి భాజా మోగినట్లే!

Published : Jun 18, 2022, 09:55 AM ISTUpdated : Jun 18, 2022, 10:34 AM IST

ఇమ్మానియేల్-వర్ష పెళ్ళిపీటలు  ఎక్కనున్నారా? ఈ బుల్లితెర ప్రేమ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుందా?  పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే ఇది జరిగేలా ఉంది. ఇమ్మానియేల్ ఇంటికి కోడలిగా వెళ్లనున్నట్లు జబర్దస్త్ వర్ష క్లారిటీ ఇచ్చేసింది.   

PREV
17
ఇమ్మానియేల్ ఇంటి కోడలిగా జబర్దస్త్ వర్ష... కంగ్రాట్స్ చెప్పిన జబర్దస్త్ టీమ్స్ .. పెళ్ళికి భాజా మోగినట్లే!
Varsha - Immanuel

రష్మీ గౌతమ్-సుధీర్ తర్వాత ఆ స్థాయిలో పాపులరైన జంట వర్ష-ఇమ్మానియేల్. సీరియల్ నటిగా కెరీర్ కొనసాగిస్తున్న వర్ష జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కారణంగా ఆమె బుల్లితెరపై బిజీ అయ్యారు. పలు ఈవెంట్స్ లో కనిపించే ఛాన్స్ దక్కించుకుంటున్నారు.

27
Varsha - Immanuel

వర్ష ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి మరొక కారణం... ఇమ్మానియేల్. ఈ జబర్దస్త్ కమెడియన్ ని ప్రేమిస్తున్నట్లు వర్ష ఓపెన్ గా చెబుతారు. ఇక బుల్లితెరపై ఈ జంట కురిపించే రొమాన్స్ పెద్ద హైలెట్. రష్మీ, సుధీర్ మాదిరి వీరికి కూడా ఉత్తిత్తి వివాహం జరిగింది. ఇక ఒకరిపై మరొకరు చేసుకునే లవ్ కామెంట్స్, ఎమోషనల్ వర్డ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. 
 

37
Varsha - Immanuel

తెల్లమ్మాయి వర్ష నలబ్బాయి ఇమ్మానియేల్ ప్రేమలో పడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఇక అప్పుడప్పుడు ఈ జంట మధ్య అలకలు, గొడవలు, కొట్లాటలు కూడా చోటు చేసుకుంటాయి. ఆ మధ్య లేడీ గెటప్ అన్నందుకు  ఇమ్మానియేల్ పై వర్ష ఫైర్ అయ్యింది. అతనిపై కోపంతో ఆ షో నుండి వాక్ అవుట్ చేసింది. ఎన్ని జరిగినా మళ్ళీ కలిసిపోతారు. ఇవన్నీ గమనిస్తున్న వారు వీరు నిజమైన ప్రేమికులే అనే నిర్ధారణకు వచ్చారు. 
 

47
Varsha - Immanuel


ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో వర్ష ఏకంగా ఇమ్మానియేల్ ఇంటికి కోడలిగా వెళతానని చెప్పి షాక్ ఇచ్చింది. జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ... ఇంతగా ఇష్టపడే మీ మధ్య ఎప్పుడైనా అనుమానాలు తలెత్తాయా? అని అడుగగా వర్ష సమాధానం చెప్పింది. జీవితంలో మిగిలిన లక్, సంతోషం ఏదైనా ఉందంటే అది ఇమ్మానియేల్. తన గురించి ఎన్ని పుకార్లు వచ్చినా నేను పట్టించుకోను. ఇమ్మానియేల్ అంటే నాకు అంత ఇష్టం, అని మనసులో మాట బయటపెట్టింది. 

57
Varsha - Immanuel

ఇక చివర్లో మీ అమ్మకు చెప్పు ఇంటికి కోడలు వస్తుందని చెప్పింది. ఆ డైలాగ్ తో ఆమె ఇమ్మానియేల్ తో పెళ్ళికి సిద్ధమని హింట్ ఇచ్చింది. వర్ష చేసిన పనికి సెట్స్ లో ఉన్నవారంతా షాక్ అయ్యారు. అదే సమయంలో ఇమ్మానియేల్ కి జబర్దస్త్ టీం సభ్యులు, స్నేహితులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 
 

67
Varsha - Immanuel

ఇక ఈ ప్రేమలు, పెళ్లిళ్లు అంతా నాటకమే అని కొట్టి పారేశావారు లేకపోలేదు. కేవలం టీఆర్పీ కోసం షో డైరెక్టర్స్ చేసే మ్యాజిక్స్ ఇవి. వీటిని నమ్మి ఇమ్మానియేల్ ని వర్ష పెళ్లి చేసుకుంటుంది అనుకుంటే పొరపాటే అంటారు కొందరు. నిజం నిలకమీద తెలుస్తుంది అంటారు కాబట్టి, వాళ్ళ ఆమధ్య ఉంది నిజమైన ప్రేమేనా? అది పెళ్ళికి దారితీస్తుందా? అనేది తెలియాలంటే ఇంకా కొన్నాళ్ళు ఆగాలి.

77
Varsha - Immanuel

ప్రస్తుతానికి ఇద్దరి కెరీర్ బాగున్నాయి. జబర్దస్త్ నుండి అనేక మంది సీనియర్స్ వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఇమ్మానియేల్, వర్ష లాంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళ టాలెంట్ నిరూపించుకునే ఛాన్స్ దక్కుతుంది.

click me!

Recommended Stories